logo

చొరవ చూపి.. సమయస్ఫూర్తి ప్రదర్శించి..

విధి నిర్వహణలో చొరవ, సమయస్ఫూర్తి చూపిన హోంగార్డు, కానిస్టేబుల్‌ ఉన్నతాధికారుల అభినందనలు అందుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌లో రోడ్డు దాటుతున్న ఇద్దరిని మద్యం మత్తులో

Published : 08 Dec 2021 03:06 IST


జితేందర్‌ సింగ్‌, సతీష్‌లను అభినందిస్తున్న ఏసీపీ సుదర్శన్‌

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో చొరవ, సమయస్ఫూర్తి చూపిన హోంగార్డు, కానిస్టేబుల్‌ ఉన్నతాధికారుల అభినందనలు అందుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌లో రోడ్డు దాటుతున్న ఇద్దరిని మద్యం మత్తులో ఉన్న చోదకుడు కారుతో ఢీకొనడంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రమాదం అనంతరం కారు చోదకుడు రోహిత్‌ గౌడ్‌, అతని స్నేహితుడు సాయి సోమన్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు పరారయ్యారు. రోడ్‌ నంబరు 5లో అపసవ్య దిశలో వెళ్తుండగా విధుల్లో ఉన్న జూబ్లీహిల్స్‌ ఠాణా హోంగార్డు జితేందర్‌ సింగ్‌, కానిస్టేబుల్‌ సతీష్‌ కారు ముందుభాగం దెబ్బతిని ఉండటం గమనించారు. కారును ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో నిలిపిన నిందితులు మరో కారులో వెళ్లిపోయారు. అనుమానించిన హోంగార్డు, కానిస్టేబుల్‌ సెల్లార్‌లో నిలిపిన కారు ఫొటో తీశారు. బంజారాహిల్స్‌ ప్రమాదంపై వైర్‌లెస్‌లో సమాచారంతో, తాము తీసిన కారు ఫొటో పంపి నిర్ధారించుకున్నారు. హోంగార్డు మరోసారి కారును పరిశీలించేందుకు వెళ్లగా అదే సమయంలో నిందితులు వచ్చారు. దీంతో సమయస్ఫూర్తిని ప్రదర్శించిన ఆయన.. ప్రమాదంలో గాయపడినవారికి చికిత్స చేయిస్తే చాలంటూ ఒప్పించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా వెంటనే వారు అక్కడికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జితేందర్‌ సింగ్‌, సతీష్‌లను బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌ కార్యాలయానికి పిలిచి సత్కరించారు. జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, పోలీసు అధికారులు, అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని