Harish Rao: కొండాపూర్‌ ఆస్పత్రిలో హరీష్‌ రావు ఆకస్మిక తనిఖీ.. వైద్యునిపై సస్పెన్షన్‌ వేటు..

హైదరాబాద్ కొండాపూర్ ఏరియా ఆస్పత్రి వైద్యుడిపై ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సస్పెన్షన్ వేటు వేశారు.

Published : 23 May 2022 16:03 IST

హైదరాబాద్‌: హైదరాబాద్ కొండాపూర్ ఏరియా ఆస్పత్రి వైద్యుడిపై ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సస్పెన్షన్ వేటు వేశారు. సోమవారం ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కావాలని అడిగితే వైద్యుడు మూర్తి డబ్బులు అడిగారని బాధితులు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. డబ్బులు అడిగిన వైద్యుడ్ని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్పత్రిలో వివిధ వార్డులను పరిశీలించిన ఆయన వైద్య సేవల తీరు ఎలా ఉందో అడిగి  తెలుసుకున్నారు. గైనకాలజీ విభాగంలో నిత్యం స్కానింగ్లు నిర్వహించాలని, అవసరమైన అల్ట్రా సౌండ్ యంత్రాలను అందిస్తామని హామీ ఇచ్చారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని