logo

ఐసీఐసీఐ ఏటీఎంలో అగ్నిప్రమాదం

వరంగల్‌ జాతీయ రహదారి పక్కన ఉన్న బ్యాంక్‌ ఏటీఎంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘట్‌కేసర్‌ సీఐ ఎన్‌.చంద్రబాబు వివరాల ప్రకారం.. జోడిమెట్ల కూడలిలో గురువారం సాయంత్రం ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన ఏటీఎం కేంద్రం నుంచి మంటలు రావడం స్థానికులు గుర్తించి..

Published : 27 May 2022 03:53 IST


మంటల్లో కాలిపోతున్న ఏటీఎం

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ జాతీయ రహదారి పక్కన ఉన్న బ్యాంక్‌ ఏటీఎంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘట్‌కేసర్‌ సీఐ ఎన్‌.చంద్రబాబు వివరాల ప్రకారం.. జోడిమెట్ల కూడలిలో గురువారం సాయంత్రం ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన ఏటీఎం కేంద్రం నుంచి మంటలు రావడం స్థానికులు గుర్తించి.. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చేలోగా మూడు ఏటీఎంలు పూర్తిగా కాలిపోయాయి. ఒక ఏటీఎం మాత్రమే పని చేస్తోందని, అందులో ఎంత మేర నగదు ఉందనే విషయం బ్యాంకు అధికారులు చెప్పాల్సి ఉందని సీఐ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు