logo

బహుమతి ఎర.. నగ్న చిత్రాలతో బెదిరింపు

బహుమతి పేరుతో మోసగించడమే కాకుండా నగ్న చిత్రాలను ఇతరులకు పంపిస్తామంటూ సైబర్‌ మోసగాళ్లు బెదిరింపులకు దిగిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

Published : 23 Mar 2023 01:55 IST

జూబ్లీహిల్స్‌: బహుమతి పేరుతో మోసగించడమే కాకుండా నగ్న చిత్రాలను ఇతరులకు పంపిస్తామంటూ సైబర్‌ మోసగాళ్లు బెదిరింపులకు దిగిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌లో నివసించే ఓ యువతి(19) ఈనెల 15న యూట్యూబ్‌లో వీడియో చూస్తుండగా షరా గ్రేస్‌ అనే మహిళకు సంబంధించిన వీడియోలో.. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే బహుమతులు అందిస్తామన్నారు. దీంతో యువతి వీడియో కింద సందేశం పెట్టగా టెలిగ్రాం చాట్‌లోకి రావాలంటూ షరా గ్రేస్‌ సూచించింది. ఈ మేరకు టెలిగ్రాంలో ఆమె అడిగిన నంబర్‌ గేమ్‌ ప్రశ్నకు యువతి సమాధానం ఇవ్వగా.. ఐఫోన్‌ 13 ప్రోతో పాటు మ్యాక్‌ బుక్‌ ప్రో గెలుచుకున్నట్లు నమ్మించింది. బహుమతులు కావాలంటే రూ.2000 చెల్లించాలని ఓ యువకుడిని పరిచయం చేసింది. యువతి రూ.1400లు చెల్లించి.. అవే ఉన్నాయని చెప్పింది. డబ్బులు లేకుంటే.. నగ్న ఫోటోలు పంపాలని యువకుడు.. ఆమెకు సూచించాడు. ఆ మాటలు నమ్మిన యువతి నగ్న ఫోటోలు పంపించి.. కాసేపటి తరువాత డిలీట్‌ చేసింది. అనంతరం యువకుడు రూ.5500 పంపాలని డిమాండ్‌ చేశాడు. లేదంటే ఆ చిత్రాలను అందరికీ పంపుతానని బెదిరించాడు. దీంతో ఆ యువతి.. జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని