logo

శునకాల దాహార్తి తీర్చేందుకు చర్యలు

నగరంలోని వీధి కుక్కల దాహార్తి తీర్చేందుకు 4,900 వాటర్‌ బౌల్స్‌ ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ అన్నారు.

Published : 27 Mar 2024 01:47 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: నగరంలోని వీధి కుక్కల దాహార్తి తీర్చేందుకు 4,900 వాటర్‌ బౌల్స్‌ ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ అన్నారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్‌ రవి కిరణ్‌, వెటర్నరీ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వీధి కుక్కల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు శునకాలకు స్టెరిలైజేషన్‌, యాంటీ బర్త్‌ కంట్రోల్‌(ఏబీసీ) వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కుక్కల దాడులపై అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కుక్క కాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువ చేయాలన్నారు. పెంపుడు శునకాలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. ఫీడర్‌ స్వచ్ఛంద సంస్థల రిజిస్ట్రేషన్‌, కమ్యూనిటీ అడాప్షన్‌పై ప్రచారం చేయాలన్నారు. శునకాల బెడద నివారణకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కోర్‌ కమిటీ ఏర్పాటు చేసి సలహాలు, సూచనలతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించాలన్నారు. సమావేశంలో వెటర్నరీ చీఫ్‌ డా.అబ్దుల్‌ వకీల్‌, బ్లూక్రాస్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అక్కినేని అమల, కుమారి, పీపుల్‌ ఫర్‌ యానిమల్స్‌ ప్రతినిధి వి.వాసంతి, యానిమల్‌ ఎయిడ్‌ సోసైటీ ప్రతినిధి అర్చన నాయుడు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని