logo

కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య

ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన  ఫిల్మ్‌నగర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు.

Published : 20 Apr 2024 03:12 IST

కారును ఢీకొట్టిన ద్విచక్రవాహనం
డబ్బులివ్వాలని, కేసు పెడతామని డ్రైవర్‌ బెదిరింపులు
ఆర్థిక స్థోమత లేక ఆత్మహత్య చేసుకున్న తల్లి.. ఇద్దరి అరెస్ట్‌

ఫిలింనగర్‌: ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన  ఫిల్మ్‌నగర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. ఫిల్మ్‌నగర్‌ దీన్‌దయాళ్‌నగర్‌లో  ఉంటున్నారు. బుధవారం తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో వీరి కుమారుడు(14) ద్విచక్రవాహనాన్ని తీసుకెళ్లాడు. హకీంబాబా దర్గా సమీపంలో  బీఎండబ్ల్యూ కారును ఢీకొట్టాడు. కారు కొంతమేర దెబ్బతినడంతో ఆగ్రహించిన కారు డ్రైవర్‌ చంద్రశేఖర్‌ బాలుడి నుంచి ద్విచక్రవాహనం తాళంచెవి లాక్కున్నాడు. స్నేహితుడు మహేష్‌ను రప్పించి,  బాలుడిని, బైక్‌ని సమీపంలోని కారు యజమాని ఇంటి సమీపంలో నిలిపారు. కారు మరమ్మతులకు రూ.20వేలవుతుందని బాలుడి తండ్రి చంద్రశేఖర్‌కు ఫోన్‌ చేసి చెప్పారు. డబ్బులిచ్చి బైక్‌ తీసుకెళ్లాలని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదవుతుందని బెదిరించారు. ఇదే విషయాన్ని తన భార్య సూర్యకుమారికి చంద్రశేఖర్‌ ఫోన్‌ చేసి చెప్పాడు. ఆందోళనకు గురైన సూర్యకుమారి.. డబ్బులు ఇచ్చేంత ఆర్థిక పరిస్థితి లేదని, కుమారుడిపై కేసు నమోదవుతుందని భర్తకు చెప్పింది. తీవ్రమనస్తాపంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఇంటికి వచ్చిన భర్తకు భార్య విగతజీవిగా కనిపించడంతో విలపించాడు. భర్త ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్‌, మహేష్‌లను శుక్రవారం అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు