logo

ఓటు సద్వినియోగానికి సౌకర్యాల కల్పన

జిల్లాలోని దివ్యాంగులకు (మూగ, చెవిటి, అంధ) లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన సౌకర్యాలను కల్పించామని జిల్లా స్వీప్‌ నోడల్‌ అధికారి మహ్మద్‌ అబ్దుల్‌ సత్తార్‌ తెలిపారు.

Published : 07 May 2024 01:37 IST

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని దివ్యాంగులకు (మూగ, చెవిటి, అంధ) లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన సౌకర్యాలను కల్పించామని జిల్లా స్వీప్‌ నోడల్‌ అధికారి మహ్మద్‌ అబ్దుల్‌ సత్తార్‌ తెలిపారు. సోమవారం దివ్యాంగులకు, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులకు, డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో జరిగిన ఓటు అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈనెల 10 వరకు గ్రామాల్లో ఎన్‌ఆర్‌జీఎస్‌ కూలీలకు, మండల, గ్రామ మహిళా సమాఖ్య సభ్యులకు సమావేశాలను నిర్వహించి ఓటు ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. ఈనెల 13న జరిగే పోలింగ్‌లో ఓటు హక్కు ఉన్న వారంతా పాల్గొని ఓటు వేయాలని కోరారు. జిల్లాలో ఈసారి శత శాతం పోలింగ్‌కు కృషి చేయాలని పేర్కొన్నారు. జిల్లా సంక్షేమాధికారిణి జ్యోతిపద్మ మాట్లాడుతూ అంధులు బ్రెయిలీ లిపి బ్యాలెట్‌ పేపర్‌తో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. దివ్యాంగులకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. పోలింగ్‌ కేంద్రం వద్ద వీరికి సహాయకులుగా వాలంటీర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ డీపీఎం రామమూర్తి, వెంకటేశ్‌, వీహెచ్‌పీఎస్‌ అధ్యక్షుడు శ్యామ్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని