logo

AP News: అతడే కావాలి.. యువకుడి వేడుకోలు

సృష్టికి విరుద్ధమైనా అతనే కావాలంటూ నిజామాబాద్‌ జిల్లా తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన కంది సాయికుమార్‌ అనే యువకుడు మైదుకూరులో హల్‌చల్‌ చేశారు. ఆ యువకుడిని తన వద్దకు చేర్చి తనకు న్యాయం చేయాలంటూ...

Updated : 24 Sep 2022 15:41 IST


సాయికుమార్‌

మైదుకూరు, న్యూస్‌టుడే : సృష్టికి విరుద్ధమైనా అతనే కావాలంటూ నిజామాబాద్‌ జిల్లా తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన కంది సాయికుమార్‌ అనే యువకుడు మైదుకూరులో హల్‌చల్‌ చేశారు. ఆ యువకుడిని తన వద్దకు చేర్చి తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. సాయికుమార్‌ చెప్పిన వివరాల మేరకు... దుబాయ్‌లో ఉపాధి పొందుతున్న తనకు మస్కట్‌లో ఉద్యోగం చేస్తున్న మైదుకూరు యువకుడితో టిక్‌టాక్‌ ద్వారా పరిచయమైందన్నారు. సెల్‌ఫోన్‌ నెంబరు తీసుకుని పరస్పరం మాట్లాడుకుంటూ వచ్చామన్నారు. ‘నీవంటే నాకు చాలా ఇష్టమని, నీవు లేకపోతే నేను బతకలేనంటూ’ చెప్పి లేనిపోని భరోసా ఇచ్చి దుబాయ్‌ నుంచి మస్కట్‌కు వచ్చేలా చేసి పెళ్లి చేసుకున్నారని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చాక తనకు దూరమయ్యాడన్నారు. ఆపై మైదుకూరు చేరుకుని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేయగా యువకుడి బంధువులే వైద్యం చేయించారని వివరించారు. యువకుడు తన వద్ద ఒకరకంగా మాట్లాడుతున్నారని, తల్లిదండ్రుల వద్ద మరో రకంగా మాట్లాడుతున్నారన్నారు. అతను లేకపోతే తాను బతకలేనంటూ చెప్పారు. తమను ఒకటి చేయాలంటూ వేడుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని