logo

పేరుకే ఎంఐజీ..కనిపించని ప్రగతి

స్థలాల కోసం అంతర్జాలంలో ఎంఐజీ లాగిన్‌ అయిన తరువాత డబ్బులు చెల్లించాలనే ఆప్షన్‌ మాత్రమే చూపుతోంది. కొనుగోలుదారుడికి ఇష్టమైన ప్లాట్‌ను ఎంపిక చేసుకునే వెసులుబాటు లేదు. కేటగిరీని ఎంపిక చేసుకొని 10 శాతం డబ్బులు చెల్లించిన తరువాత డిమాండు ఆధారంగా స్థలాలు కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు.

Published : 15 Jan 2022 02:25 IST

స్థలాల అభివృద్ధికి ముందే బుకింగు

70 దరఖాస్తుల దాఖలు

ఈ ఖాళీ భూముల్లోనే ఎంఐజీ లే అవుట్‌ ఏర్పాటు చేసేది...

స్థలాల కోసం అంతర్జాలంలో ఎంఐజీ లాగిన్‌ అయిన తరువాత డబ్బులు చెల్లించాలనే ఆప్షన్‌ మాత్రమే చూపుతోంది. కొనుగోలుదారుడికి ఇష్టమైన ప్లాట్‌ను ఎంపిక చేసుకునే వెసులుబాటు లేదు. కేటగిరీని ఎంపిక చేసుకొని 10 శాతం డబ్బులు చెల్లించిన తరువాత డిమాండు ఆధారంగా స్థలాలు కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు. డబ్బులు చెల్లించిన తరువాత లబ్ధిదారులకు స్థలాలు కేటాయిస్తామని అథారిటీ అధికారులు చెబుతున్నారు. అంతర్జాలంలో లబ్ధిదారుడు ఎంపిక చేసుకునే వెసులుబాటు లేనందున ఇబ్బందిపడే అవకాశం ఉందని దరఖాస్తుదారులు అనుమానం వ్యక్తం చేశారు.

టౌన్‌షిప్‌ ప్లాట్లకు ప్రధాన రహదారులను అనుసంధానిస్తూ అధికారులు మ్యాపులు రూపొందించారు. పట్టణ సమీపంలోని రింగ్‌రోడ్డు నుంచి రెండు కిలోమీటర్లు పైబడి అనుసంధానిస్తూ 60 అడుగుల రహదారి, రాయచోటి-వీరబల్లి రోడ్డు నుంచి ఒకటిన్నర కిలో మీటరు మేర అనుసంధాన రహదారిని ఏర్పాటు చేసినట్లు లేఅవుట్‌ లో చూపారు. అయినా ఇప్పటి వరకు రహదారులు ఏర్పాటు కాలేదు.

లబ్ధిదారులకు ఇబ్బందులుండవు

30 ఎకరాల విశాలమైన ప్రదేశంలో ఎంఐజీ లేఅవుట్‌ రూపుదిద్దుకొంటోంది. అక్కడ ఎలాంటి భూ వివాదాలు లేవు. రహదారుల సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొన్నాం. రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. లబ్ధిదారులు చెల్లించే ప్రతి పైసాకు ప్రభుత్వమే బాధ్యతగా ఉంటుంది. అంతర్జాలంలోని లేఅవుట్‌లో సాంకేతిక సమస్యలుంటే చక్కదిద్దుతాం.- సుబ్రహ్మణ్యంరెడ్డి, తహసీీల్దారు, రాయచోటి

రూపొందించిన టౌన్‌షిప్‌ లేఅవుట్‌ ఇదే

రాయచోటి, న్యూస్‌టుడే: రాయచోటి సమీపంలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన టౌన్‌షిప్‌ ప్రాజెక్టు కింద స్థలాల విక్రయానికి అధికారులు శ్రీకారం చుట్టారు. స్థలాల అభివృద్ధి, లేఅవుట్‌ అనుమతి, అంతర్గత రహదారుల ఏర్పాటు తదితర లాంఛనాలు పూర్తి చేయకుండానే ప్రక్రియ ప్రారంభించటంపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతానికి స్థలాలపై లేఅవుట్‌ మ్యాపు మాత్రమే రూపొందించారు. అంతర్జాలంలో ఆకర్షణీయంగా బ్రోచర్‌ను తీర్చిదిద్ది విక్రయాలు ప్రారంభించారు. రాష్ట్రంలోని అయిదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా టౌన్‌షిప్‌ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో రాయచోటి ఒకటి.

l రాయచోటి టౌన్‌షిప్‌ ప్రాజెక్టు బాధ్యతను ప్రభుత్వం అన్నమయ్య డెవలప్‌మెంట్‌ అథారిటీకి అప్పగించింది. లే అవుట్లను అభివృద్ధి పరిచి స్థలాలను మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉంచాలని నిర్దేశించారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండానే లేఅవుట్‌ ప్లాన్‌ను చూపించి ప్లాట్లను విక్రయిస్తున్నారు. దరఖాస్తు సమయంలోనే కొనుగోలుదారుడు ధరావతులో 10 శాతం, నెల తరువాత 30 శాతం, ఆరు మాసాలకు 30 శాతం, మిగిలిన పైకం 12 నెలల్లో చెల్లించాలని నిబంధన విధించారు. 70 మంది దరఖాస్తు చేసుకున్నారు.

అనుమతి లేకుండానే...

టౌన్‌షిప్‌ కింద ప్రభుత్వం విక్రయించే స్థలాలను రెవెన్యూ విభాగంలోని నిషేధిత చట్టం 22ఏ నుంచి తొలగించాలి. పురపాలక, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలు సంయుక్తంగా ఈ స్థలాలకు ముందస్తుగా ప్లాన్‌ అప్రూవల్‌ మంజూరు చేయాలి. అయినా ఇక్కడ అనుమతుల ప్రక్రియ పూర్తి కాకుండానే స్థలాల విక్రయం సాగుతోంది. l రాయచోటి పట్టణ సమీపంలోని డి.అబ్బవరం ప్రాంతంలో గతంలో అధికారులు సుమారు వంద ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. ఆ భూమికి రెండు, మూడు కిలోమీటర్ల లోపే ప్రైవేట్‌ రియల్‌ ఎస్టేఫట్‌ వ్యాపారాలు సాగుతున్నాయి. అక్కడి ప్లాట్ల ధరలు బేరీజు వేసి ప్రభుత్వ స్థలాలకు ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్లకు ఏడాది గడువు పెట్టినా ఆరునెలలలోపే 70 శాతం డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో అథారిటీకి ఆదాయం తప్ప లబ్ధిదారుడికి చేకూరే ప్రయోజనం ఏడాది వరకు తేలే అవకాశం లేదు. l రాయచోటి, వీరబల్లి, రామాపురం మూడు మండలాల సరిహద్దు అవడం వల్ల టౌన్‌షిప్‌ అభివృద్ధి అయితే లాభిస్తుందని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తమ స్థలాలను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని