logo

కమలాపురాన్ని గ్రామపంచాయతీగా చేయాలి: పుత్తా

కమలాపురాన్ని నగరపంచాయతీగా చేయడంతో పేదలు ఉపాధిహామీ పనులు కోల్పోయారని, తెదేపా అధికారంలోకి రాగానే గ్రామపంచాయతీగా మార్చాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని కోరారు. కమలాపురంలో బుధవారం

Published : 19 May 2022 03:54 IST


మాట్లాడుతున్న పుత్తా నరసింహారెడ్డి

కమలాపురం, న్యూస్‌టుడే : కమలాపురాన్ని నగరపంచాయతీగా చేయడంతో పేదలు ఉపాధిహామీ పనులు కోల్పోయారని, తెదేపా అధికారంలోకి రాగానే గ్రామపంచాయతీగా మార్చాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని కోరారు. కమలాపురంలో బుధవారం పర్యటించిన చంద్రబాబుకు పుత్తా ఆధ్వర్యంలో యువ నాయకులు పుత్తా కృష్ణచైతన్య రెడ్డి, లక్ష్మీరెడ్డి, పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన బాదుడే..బాదుడు కార్యక్రమంలో పుత్తా పలు సమస్యలు ప్రస్తావించారు. పార్టీ అధికారంలోకి రాగానే ఉచితంగా ఇసుకను ఇవ్వాలన్నారు. ధరల బాదుడుతో ప్రజలు పండగలు జరుపుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఏ ఒక్కరికి బిందు, తుంపర సేద్యం పరికరాలివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామని చెబుతున్నారని, దీనిని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేయాలని కోరారు. వీటితోపాటు పలు సమస్యలను ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటిపైనా స్పందించిన ఆయన సాధ్యాసాధ్యాలను పరిశీలించి అందరి అభిప్రాయాలతో గ్రామ పంచాయతీగా చేస్తామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని