logo

350 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌

హుజూరాబాద్‌లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్‌ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్‌మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్‌ చేసి...

Published : 19 Apr 2024 04:56 IST

హుజూరాబాద్‌లోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ గోదాంలో నిల్వ చేసిన బియ్యం బస్తాలు

హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్‌ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్‌మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్‌ చేసి గుజరాత్‌కు తరలిస్తుండగా ఈ నెల 9న అర్ధరాత్రి హుజూరాబాద్‌ శివారులో పోలీసులు పట్టుకొని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించిన విషయం విదితమే. ఆ బియ్యం దొడ్డురకాలు కావడంతో ప్రజా పంపిణీకి చెందినవిగా అనుమానించిన అధికారులు.. నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించారు. బియ్యం కొత్తగా మిల్లింగ్‌ చేయలేదని.. నాలుగు నెలలపైబడి పాతవిగా ప్రయోగశాల నుంచి నివేదిక వచ్చింది. దీంతో రేషన్‌ బియ్యమేనని నిర్ధారించి సీజ్‌ చేసినట్లు డీటీసీఎస్‌ టి.వసంతరావు తెలిపారు. లారీలోని 350 క్వింటాళ్ల బియ్యాన్ని అన్‌లోడ్‌ చేసి హుజూరాబాద్‌లోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో నిల్వ చేసి గోదాం అధికారికి అప్పగించినట్లు పేర్కొన్నారు. పరకాలలోని రైస్‌మిల్లు యజమాని శ్రావణ్‌కుమార్‌తో పాటు లారీ డ్రైవర్‌పై 6ఎ చట్టం కింద కేసు నమోదు చేసేందుకు కలెక్టర్‌కు నివేదిక అందజేశామని ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని