logo

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నిజామాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్‌ మండలం గోవింద్‌పేట్‌, పిప్రి, చేపూర్‌ గ్రామాల్లో, మాక్లూర్‌ మండలకేంద్రంలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు.

Published : 04 May 2024 04:42 IST

ఆర్మూర్‌ గ్రామీణం, మాక్లూర్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నిజామాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్‌ మండలం గోవింద్‌పేట్‌, పిప్రి, చేపూర్‌ గ్రామాల్లో, మాక్లూర్‌ మండలకేంద్రంలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ వస్తేనే ఉపాధిహామీకి, బతుకు దెరువుకు గ్యారెంటీ ఏర్పడుతుందన్నారు. రోజువారీ కూలీ రూ.400కు పెంచుతామన్నారు. వేసవిలో 35 శాతం అదనంగా బోనస్‌ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తనకు అండగా నిలిచి ఎంపీగా గెలిపించాలని కోరారు. గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగులకు కొలువులు, రేషన్‌కార్డులు, పింఛన్లు రావాలన్నా కాంగ్రెస్‌కు ఓటేస్తేనే సాధ్యమవుతాయన్నారు. ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ప్రజా సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు. భారాస, భాజపాలకు గుణపాఠం చెప్పాలని ఓటర్లకు సూచించారు. కార్యక్రమాల్లో ఆర్మూర్‌ నియోజకవరగ ఇన్‌ఛార్జి వినయ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ మార గంగారెడ్డి, గ్రంథాలయ మాజీ ఛైర్మన్‌ మార చంద్రమోహన్‌, సదానందం, చిన్నారెడ్డి, జీవన్‌, ఎంపీపీ పస్క నర్సయ్య, అజార్‌ కిషన్‌రావు, డేగ పోశెట్టి, రవిప్రకాష్‌, బూరొల్ల అశోక్‌ పాల్గొన్నారు. పిప్రి సొసైటీ మాజీ ఛైర్మన్‌ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీ సభ్యురాలు ఎర్రవ్వ, పలు సంఘాల సభ్యులు, మాక్లూర్‌, చిన్నాపూర్‌కు చెందిన భారాస నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. నాయకులు అయ్యప్ప శ్రీనివాస్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీటీసీ సభ్యుడు ఎంసీ గంగారెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ లింగాగౌడ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని