logo

‘శుద్ధజల కేంద్రం నిర్వహణను పురసభకు ఇవ్వండి’

స్థానిక ఎండీ క్యాంపులోని శుద్ధజల కేంద్రం నిరుపయోగంగా ఉంది. దీని బాధ్యతను పురసభకు అప్పగించాలని స్థాయి సమితి అధ్యక్షుడు సి.ఆర్‌.హనుమంత డిమాండ్‌ చేశారు. ఆ కేంద్రం వద్ద శనివారం వారు ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ రెండేళ్ల క్రితం జడ్పీ నిధులతో ఏర్పాటు చేసిన

Published : 29 May 2022 03:27 IST

తెలుపుతున్న పురసభ అధ్యక్షురాలు, సభ్యులు

కంప్లి న్యూస్‌టుడే: స్థానిక ఎండీ క్యాంపులోని శుద్ధజల కేంద్రం నిరుపయోగంగా ఉంది. దీని బాధ్యతను పురసభకు అప్పగించాలని స్థాయి సమితి అధ్యక్షుడు సి.ఆర్‌.హనుమంత డిమాండ్‌ చేశారు. ఆ కేంద్రం వద్ద శనివారం వారు ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ రెండేళ్ల క్రితం జడ్పీ నిధులతో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రం నిరుపయోగంగా మారడంతో క్యాంపు ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తుందన్నారు. కేంద్రాన్ని పురసభకు అప్పగిస్తే బాగుచేసి నీటిని సరఫరా చేస్తామన్నారు. ఈ విషయమై జిల్లా పాలనాధికారికి పురసభ ద్వారా వినతిపత్రం సమర్పిస్తామన్నారు. అనంతరం ఎండీ క్యాంపులో ఉద్యానవన ప్రహరీ నిర్మాణానికి పురసభ అధ్యక్షురాలు శాంతలా భూమిపూజ చేశారు. సభ్యులు ఆర్‌.ఆంజనేయ, టి.వి.సుదర్శనరెడ్డి, రామాంజనేయులు, నాయకులు బ్రహ్మయ్య, రామణ్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని