కాంగ్రెస్‌లోకి కోలారు నేతలు
రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కొత్తూరు మంజునాథ్, ఎంసీ సుధాకర్ తదితరులు
చింతామణి, యశ్వంతపుర, చింతామణి, న్యూస్‌టుడే : కోలారు జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యుడు కొత్తూరు మంజునాథ్ (ముళబాగిలు), డాక్టర్ ఎం.సి.సుధాకర్ (చింతామణి) బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఇద్దరూ బుధవారం దిల్లీలో కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ఎంసీ వేణుగోపాల్, రణదీప్‌సింగ్ సుర్జేవాలా సమక్షంలో కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు రమేష్‌కుమార్, నాసీర్ అహ్మద్, శివశంకర్‌రెడ్డి, నంజేగౌడ, అనిల్‌కుమార్, నారాయణస్వామి, శ్రీనివాస్‌గౌడ తదితరులు పాల్గొన్నారు.
* ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆగస్టు 3న రాష్ట్రానికి రానున్నారు. ఆరోజు దావణగెరెలో నిర్వహించే ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య 75వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటారు. ఓ బహిరంగ సభలోనూ ప్రసంగిస్తారు. ‘నా మిత్రులు, అభిమానులు అక్కడే పుట్టిన రోజు వేడుకలు చేయాలని నిర్ణయించారు. ఆ కార్యక్రమానికి మీరూ వస్తే బాగుంటుందని రాహుల్‌గాంధీకి సూచించా. ఆయన పెద్ద మనసుతో ఒప్పుకొన్నారు’ అని సిద్ధరామయ్య వివరించారు. పార్టీ తరఫున ఆరోజు జనసేకరణకూ ముందడుగు వేసే అవకాశాలున్నాయని సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
-
World News
Kabul: కాబుల్ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం?
-
World News
Srilanka: బ్యాంకాక్‌లో గొటబాయ.. 24న శ్రీలంకకు తిరిగొచ్చేస్తున్నారట!
-
Crime News
Dalit Boy Death: 23రోజుల్లో 6 ఆస్పత్రులు తిప్పినా.. దక్కని బాలుడి ప్రాణం
-
Politics News
Koppula Eshwar: మంత్రి కొప్పులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
Politics News
Nitish Kumar: నీతీశ్ కేబినెట్లో72% మందిపై క్రిమినల్ కేసులు.. 27మంది కోటీశ్వరులే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Biden: దగ్గిన చేతితోనే పెన్ను ఇచ్చి, కరచాలనం చేసి..!
- Bihar: అరెస్టు వారెంటున్న నేత.. న్యాయశాఖ మంత్రిగా ప్రమాణం..!
- Tollywood: విజయేంద్రప్రసాద్ కథతో భారీ బడ్జెట్ మూవీ.. దర్శకుడు ఎవరంటే?
- Chandrababu: ఎన్నికలకు సమయం లేదు.. దూకుడు పెంచాలి: చంద్రబాబు
- Crime news: ‘టీ’లో విషం కలిపి ముగ్గురు పిల్లలను హత్యచేసిన తల్లి
- Shyam Singha Roy: ఆస్కార్ నామినేషన్ల పరిశీలన రేసులో ‘శ్యామ్ సింగరాయ్’
- Health tips: ఆరు రుచులతో ఆరోగ్యం.. ఈ విశేషాలు మీకు తెలుసా?
- Heart Health: చేపలతో గుండెకెంత మేలో తెలుసా..?