logo

జెండా పండుగకు ఘనంగా ఏర్పాట్లు

స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె ఏర్పాట్లలో మునిగిపోయింది. ఎంజీ రోడ్డు మాణిక్‌షా సైనిక మైదానంలో ఆ ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 09 Aug 2022 02:10 IST


మాణిక్‌ షా మైదానం గోడలకు రంగులు వేస్తున్న కార్మికులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె ఏర్పాట్లలో మునిగిపోయింది. ఎంజీ రోడ్డు మాణిక్‌షా సైనిక మైదానంలో ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా పాలికె, బెంగళూరు నగర జిల్లాధికారులు సంయుక్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటి నిర్వహణ కోసం నిపుణులతో కూడిన మూడు సమితులను ఏర్పాటు చేశారు. సైనిక దళాలు, పోలీసులు, విద్యార్థులు కవాతు నిర్వహిస్తారని పాలికె చీఫ్‌ కమిషనర్‌ తుషార్‌గిరినాథ్‌ తెలిపారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవం సందర్భంగా పది లక్షల మందికి జాతీయ జెండాలను విక్రయిస్తారు. మాణిక్‌షా కార్యక్రమాన్ని వీక్షించేందుకు 25 వేల మందికి అవకాశం కల్పిస్తారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల విజయవతంఆనికి పాలికె పరిధిలోని విద్యా సంస్థల సాయం తీసుకుంటారు. రెండువేల మంది విద్యార్థులు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలకు సహకరిస్తారు.


మైదానంలో జోరుగా స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లు

త్రివర్ణ పతాకాలు ఎగురవేసేది వీరే!
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : పంద్రాగస్టుకు విజయనగర జిల్లాలో పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. కొప్పళ జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రి శశికళ జొల్లె అణ్ణా సాహేబ, మండ్య జిల్లాలో రెవెన్యూ మంత్రి ఆర్‌.అశోక్‌ జెండా పతాకావిష్కరణలో ముందు వరుసలో నిలుస్తారు. ఇతర జిల్లాలకు వ్యవహారాల బాధ్యులుగా ఉన్న మంత్రులే ధ్వజారోహణ చేస్తారని, ఒక వేళ అనారోగ్యం, ఇతర కారణాలతో సంబంధిత మంత్రి గైర్హాజరయితే ఆయా జిల్లాలకు చెందిన జిల్లాధికారులే జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని