logo

ఆర్థిక వ్యవస్థకు చుక్కాని

భారతీయ రిజర్వుబ్యాంకు ప్రగతికి సంకేతమని, దేశ ఆర్థిక రక్షణ, రాజ్యాంగానికి ఆత్మలాంటిదని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కొనియాడారు.

Published : 29 Nov 2022 01:08 IST

డాక్టర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పుష్పార్చన చేస్తున్న ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : భారతీయ రిజర్వుబ్యాంకు ప్రగతికి సంకేతమని, దేశ ఆర్థిక రక్షణ, రాజ్యాంగానికి ఆత్మలాంటిదని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కొనియాడారు. బ్యాంకు అనుబంధ దళిత- గిరిజన వర్గాల ఉద్యోగుల సంఘం సోమవారం బెంగళూరులో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ కొనసాగింపు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. సంస్థకు ఉన్న చరిత్రను ప్రస్తావిస్తూ అది మరింతగా ఇనుమడించాలని ఆకాంక్షించారు. స్వాతంత్య్ర పూర్వం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను ఈ సంస్థ చక్కగా నిర్వహించినట్లు వివరించారు. కరోనా తరువాత అనేక దేశాల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారినా.. భారత్‌లో ఆ సమస్య ఎదురుకాకుండా కాపాడిందని గుర్తుచేశారు. పీడితులకు సామాజిక న్యాయం కల్పించడానికే డాక్టర్‌ అంబేడ్కర్‌ శ్రమించారని, ఆర్‌బీఐ విధానాలను ఆయనే రూపొందించి అమలు చేయడం వల్ల ఇప్పటి వరకు ఆటుపోట్లను తట్టుకోగలిగినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయ సంచాలకుడు గురుమూర్తి, నిర్వాహక సంఘం అధ్యక్షుడు మాధవ కాళె, కార్యదర్శి వసంతకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని