logo

రూ.14 లక్షల ధర పలికిన ఎద్దు

ముధోళకు చెందిన కాశిలింగప్ప గడదార, యమనప్ప గడదార అనే రైతు సోదరులు ఏడాది క్రితం రూ.5 లక్షలకు ఒక ఎద్దును కొనుగోలు చేసుకున్నారు.

Published : 30 Jan 2023 02:25 IST

ఎద్దుతో విఠల, అతని కుటుంబ సభ్యులు

బాగలకోట, న్యూస్‌టుడే: ముధోళకు చెందిన కాశిలింగప్ప గడదార, యమనప్ప గడదార అనే రైతు సోదరులు ఏడాది క్రితం రూ.5 లక్షలకు ఒక ఎద్దును కొనుగోలు చేసుకున్నారు. మూడలగి తాలూకా రడ్యారట్టిలో కొనుగోలు చేసుకు వచ్చిన ఈ ఎద్దును చక్కని పోషించారు. ఈ ఎద్దును నందగావ గ్రామానికి చెందిన విఠల అనే రైతు రూ.14 లక్షలు చెల్లించి, దీన్ని కొనుగోలు చేసుకున్నారు. పోటీల కోసం సిద్ధం చేసిన ఈ ఎద్దు కర్ణాటక, మహారాష్ట్రలలో పలు పోటీలలో పాల్గొంది. ఇప్పటి వరకు ఆరు బైకులు, ఐదు తులాల బంగారం, రూ.12 లక్షల బహుమతిని తమకు సంపాదించి పెట్టిందని కాశీలింగప్ప, యమనప్ప తెలిపారు. విఠల, అతని కుటుంబ సభ్యులు పలుసార్లు కోరడంతో తాము ఆయనకు తమ ఎద్దును విక్రయించామని చెప్పారు. కాశిలింగప్ప కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఆ ఎద్దుకు పూజలు చేసి విఠలకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని