logo

‘నా హయాంలోనే నియోజకవర్గ ప్రగతి సాధ్యం’

సింధనూరు తాలూకాలోని చాలా వరకూ గ్రామీణ దారులు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిపినవే..తిరిగి మళ్లీ ఎవరూ వాటి ముఖం చూడలేదు.

Published : 22 Mar 2023 02:49 IST

సింధనూరు గణేశ్‌క్యాంపులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే నాడగౌడ

సింధనూరు, న్యూస్‌టుడే: సింధనూరు తాలూకాలోని చాలా వరకూ గ్రామీణ దారులు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిపినవే..తిరిగి మళ్లీ ఎవరూ వాటి ముఖం చూడలేదు. చిన్నపాటి మరమ్మతులు చేసుకుంటూ ఉంటే బాగుంటాయి..కనీసం గుంతలనైనా పూడ్చకపోవడంతో దుస్థితికి దిగజారాయని..ఇకపై అలా కాకుండా ఏటా మరమ్మతులు జరుపుతామని ఎమ్మెల్యే నాడగౌడ పేర్కొన్నారు. మంగళవారం మారుమూల ఉన్న  గణేశ్‌క్యాంపులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. గతంలో నేను ఎమ్మెల్యేగా సేవలందించినప్పుడు ముఖ్య రహదారి నుంచి పల్లెలను కలిపే అన్ని గ్రామీణ మార్గాలను అభివృద్ధి చేశానని చెప్పారు. గ్రామస్థులు సంచరించడానికి, రైతులు ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల వంటివి సులవుగా పొలానికి తీసుకెళ్లడానికి అనువుగా ఈ మార్గాలు నిర్మించి, బాగు చేయించగా తదుపరి అధికారంలోకి వచ్చిన నాయకులు వీటి మరమ్మతులు పట్టించుకోనందున..నేడు మళ్లీ అభివృద్ధి చేయాల్సి వస్తోందన్నారు. చెన్నళ్లి నుంచి గణేశ్‌క్యాంపు వరకూ ఉన్న మార్గాన్ని రూ.80 లక్షలతో తారు రోడ్డుగా మలచే పనులకు గణేశ్‌క్యాంపులో భూమిపూజ చేశారు.  అనంతరం ఆయన ముక్కుంద, హుడా, సోమలాపూరు, రౌడుకుంద, మల్కాపూరు, సాసలమరిక్యాంపు, సాలగుంద గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు. ప్రముఖులు మురళీకృష్ణ, మల్లనగౌడ, బసవరాజరెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని