logo

నగరం.. అష్టదిగ్బంధం

నగర పోలీసు కమిషనరేట్‌, బెంగళూరు నగర జిల్లా పరిధిలోని 32 విధానసభ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఐదు ప్రదేశాల్లో శనివారం ఉదయం ప్రారంభం కానుంది.

Published : 13 May 2023 06:10 IST

బెంగళూరు : బీఎంఎస్‌ కళాశాల వెలుపల భద్రత. సిబ్బందితో చర్చిస్తున్న ఉన్నతాధికారులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : నగర పోలీసు కమిషనరేట్‌, బెంగళూరు నగర జిల్లా పరిధిలోని 32 విధానసభ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఐదు ప్రదేశాల్లో శనివారం ఉదయం ప్రారంభం కానుంది. ప్రతి లెక్కింపు కేంద్రం భద్రత బాధ్యతలను ఇద్దరు డీసీపీలకు అప్పగించారు. అధికారులతో పాటు 1500 వందల మంది బందోబస్తు కోసం వినియోగించనున్నట్లు పోలీసు కమిషనర్‌ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. శాంతిభద్రతలకు ఎలాంటి ముప్పు కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.

* నగర తూర్పు, పడమటి విభాగాల అదనపు పోలీసు కమిషనర్లు, పది మంది డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 38 మంది ఇన్స్‌పెక్టర్ల, 250 పీఎస్‌ఐలు, 1200 వందల మంది పోలీసు కానిస్టేబుళ్లుతో పాటు 12 కేంద్ర పారామిలటరీ దళాలు, 36 రాష్ట్ర రిజర్వుడ్‌ పోలీసు దళాలను బందోబస్తు కోసం వినియోగించనున్నారు. ప్రతి లెక్కింపు కేంద్రం వద్ద ముగ్గురు ఏసీపీలు, ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 50 మంది పీఎస్‌ఐలు మూడు వందల మంది పోలీసు సిబ్బంది భద్రత కోసం ఏర్పాటు చేశారు.

లెక్కింపు ప్రాంతాలు ఎక్కడెక్కడంటే?

* వసంతనగర మౌంట్‌ కార్మల్‌ కళాశాలలో కె.ఆర్‌.పురం, మహాలక్ష్మీలేఔట్‌, మల్లేశ్వరం, హెబ్బాళ్‌, పులికేశినగర, సర్వజ్ఞనగర, సీవీరామన్‌నగర విధానసభ స్థానాల ఓట్లు లెక్కిస్తారు. కేంద్ర, తూర్పు విభాగాల డీసీపీలకు భద్రత బాధ్యతలను అప్పగించారు.

* సెయింట్‌ జోసెఫ్‌ ఇండియన్‌ హైస్కూల్‌లో ఆనేకల్‌, బెంగళూరు దక్షిణ, మహదేవపుర, బ్యాటరాయనపుర, యలహంక, దాసరహళ్లి విధానసభ స్థానాల ఓట్లను లెక్కిస్తారు. వైట్‌ఫీల్డ్‌, సీసీబీ విభాగం డీసీపీలకు భద్రత ఏర్పాట్లను పర్వేక్షిస్తారు.

* బసవనగుడి బీఎంఎస్‌ మహిళ కళాశాలలో శాంతినగర, గాంధీనగర, రాజాజినగర, చిక్కపేట, చామరాజపేట, ఆర్‌ఆర్‌నగర, శివాజీనగర విధానసభ స్థానాల ఓట్లను లెక్కిస్తారు. దక్షిణ విభాగం, కమాండ్‌ సెంటర్‌ డీసీపీలు భద్రత బాధ్యతలను అప్పగించారు.తిలక్‌నగర్‌ ఎస్‌ఎస్‌ఎంఆర్‌వీ కళాశాలలో పద్మనాభనగర, గోవిందరాజనగర, విజయనగర, జయనగర, బీటీఎంలేఔట్‌, బొమ్మనహళ్లి, బసవనగుడి విధానసభ స్థానాల ఓట్లను లెక్కిస్తారు.   ఆగ్నేయ, సీఏఆర్‌ విభాగాల ఇద్దరు డీసీపీలు బందోబస్తు ఏర్పాట్లను పర్వేక్షిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని