తగ్గిన వర్షం.. పెరిగిన ఉక్కపోత
రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి వాతావరణంలో పెను మార్పులు భయపెడుతున్నాయి. గురు, శుక్రవారాలలో వర్ష ప్రభావం లేకపోవడంతో బెస్కాం, బెంగళూరు పాలికె అధికారులు ఊపిరి పీల్చుకున్నా.. ఉక్కపోతతో నగర జనం హడలిపోయారు.
పాత బెంగళూరులో ప్రమాదకరంగా వాలిన స్తంభం
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి వాతావరణంలో పెను మార్పులు భయపెడుతున్నాయి. గురు, శుక్రవారాలలో వర్ష ప్రభావం లేకపోవడంతో బెస్కాం, బెంగళూరు పాలికె అధికారులు ఊపిరి పీల్చుకున్నా.. ఉక్కపోతతో నగర జనం హడలిపోయారు. ఈదురుగాలులతో విరిగి పడిన చెట్ల కొమ్మలను తొలగించిన కార్మికులు.. పలు చోట్ల విరిగిన స్తంభాలను సరిచేశారు. కొన్ని స్తంభాలను ఇప్పటికిప్పుడు మార్చలేక తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ఈ తరహా పనులు అక్కడక్కడ వాహనదారులను భయపెడుతున్నాయి. రాజకాలువలో ప్రవాహానికి అడ్డుపడుతున్న వ్యర్థాలను తొలగించారు. రాజకాలువలోకి కొన్ని పరిశ్రమలు వ్యర్థ రసాయనాలు విడిచి పెడుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మురుగునీటిలో రసాయనాలు కలుస్తూ ఉండడంతో నురగ ఎక్కువ అవుతుందని తెలిపారు. రసాయన వ్యర్థాలు కాలువలో చేరకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bennu: నాసా ఘనత.. భూమి మీదికి గ్రహశకలం నమూనాలు!
-
Canada MP: ‘కెనడా హిందువుల్లో భయం’.. ట్రూడోపై సొంతపార్టీ ఎంపీ ఆర్య విమర్శలు..!
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
TTD: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. చంద్రప్రభ వాహనంపై శ్రీనివాసుడు
-
Chandrababu Arrest: అమీర్‌పేటలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ