logo

అక్రమ తరలింపులపై దాడులు

లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల నియమావళి ప్రవర్తన ఉల్లంఘించి అక్రమంగా మద్యం నిల్వ చేసిన ఇంటిపై, రవాణా చేస్తున్న వారి నుంచి రూ.3.52 లక్షలు విలువ చేసే 842.72 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా తెలిపారు.

Published : 28 Mar 2024 03:00 IST

బళ్లారి, న్యూస్‌టుడే : లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల నియమావళి ప్రవర్తన ఉల్లంఘించి అక్రమంగా మద్యం నిల్వ చేసిన ఇంటిపై, రవాణా చేస్తున్న వారి నుంచి రూ.3.52 లక్షలు విలువ చేసే 842.72 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా తెలిపారు. అబ్కారీశాఖ కమిషనర్‌ ఆదేశాలతో ఆ శాఖ అధికారులు, సిబ్బంది 705.01 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌ అధికారి ఆదేశాలతో పోలీసులు 131.71 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. రూ.40 వేల విలువ చేసే వాహనం కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి వచ్చినప్పటి నుంచి నేటి వరకు మొత్తం 53 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సరైన పత్రాలు లేకుండా నిల్వ చేసిన 20,112 కిలోల రసాయన మందులను స్వాధీనం చేసుకున్నారు. మద్యం రవాణా చేస్తున్న వారిపై మూడు కేసులు నమోదు చేశామని జిల్లా అబ్కారీశాఖ కమిషనర్‌ మంజునాథ తెలిపారు.


చెక్‌పోస్టు వద్ద నగదు స్వాధీనం

చెళ్లకెర (చిత్రదుర్గం): హొసపేట నుంచి చిత్రదుర్గం వైపు  భరమసాగర గ్రామానికి చెందిన మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.రూ.20.35 లక్షల నగదును పిల్లేకెరెనహళ్లి గ్రామం వద్ద ఉన్న చెక్‌పోస్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారని తహసీల్దారు నాగవేణి తెలిపారు. మనోజ్‌ కుమార్‌ కారును తనిఖీ చేసేటప్పుడు అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో గుర్తించిన అధికారులు కారును పరిశీలించారు. కారు డిక్కీలో మ్యాÆటు కింద దాచి ఉంచిన డబ్బు కట్టలను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. నిందితుడిపై గ్రామీణ పోలీసు ఠాణాలో కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని