logo

చిత్రదుర్గ బరిలో కారజోళ!

రాష్ట్రం నుంచి లోక్‌సభకు పోటీ చేసే పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితాను భాజపా వెల్లడించింది.

Published : 28 Mar 2024 03:13 IST

ఈనాడు, బెంగళూరు- న్యూస్‌టుడే, చిత్రదుర్గ : రాష్ట్రం నుంచి లోక్‌సభకు పోటీ చేసే పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితాను భాజపా వెల్లడించింది. ఇప్పటికే రెండు విడతల్లో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన భాజపా బుధవారం చివరి స్థానం చిత్రదుర్గ నుంచి పోటీ చేసే అభ్యర్థిగా మాజీ మంత్రి గోవింద కారజోళ పేరు ప్రకటించింది. ప్రస్తుతం ఈ స్థానానికి ఎ.నారాయణస్వామి ఎంపీగా ఉండగా.. ఆయన కేంద్ర మంత్రిగానూ కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న రాష్ట్ర నేతల్లో టికెట్‌ దక్కనిది ఆయనకు మాత్రమే!

జేడీఎస్‌తో పొత్తు కారణంగా మొత్తం 28 స్థానాలకు గాను భాజపా 25 చోట్ల తమ అభ్యర్థులను బరిలో దింపుతోంది. మూడు స్థానాలను జేడీఎస్‌కు కేటాయించింది. భాజపా పోటీ చేసే 25 స్థానాల్లో 24 చోట్ల సిట్టింగ్‌ ఎంపీలున్నారు. వీరిలో 10 మందికి మరోసారి టికెట్‌ ఇవ్వగా 13 మందికి టికెట్‌ నిరాకరించింది. చిక్కమగళూరు ఎంపీగా ఉన్న శోభా కరంద్లాజెకు బెంగళూరు ఉత్తర కేటాయించారు. గత విధానసభ ఎన్నికల్లో ఓడిన వారిలో ఆరుగురికి ఈ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వగా వీరిలో తాజాగా చిత్రదుర్గం నుంచి టికెట్‌ పొందిన గోవింద కారజోళ ఒకరు. ఆయన బాగల్‌కోటె జిల్లా నుంచి విధానసభకు ఎన్నికవుతున్నా లోక్‌సభ కోసం చిత్రదుర్గ జిల్లాకు రావాల్సి వచ్చింది. ఆయన పోటీపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని