logo

యూట్యూబర్‌ దుస్సాహసం.. ఎయిర్‌పోర్టు రన్‌వేపై వీడియో చిత్రీకరించి..

బెంగళూరు నగర శివారు దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై వీడియో చిత్రీకరించి, యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన యూట్యూబర్‌ వికాస్‌ గౌడను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

Updated : 18 Apr 2024 09:01 IST

వికాస్‌ గౌడ

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : బెంగళూరు నగర శివారు దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై వీడియో చిత్రీకరించి, యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన యూట్యూబర్‌ వికాస్‌ గౌడను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ‘టికెట్‌ లేకుండా రన్‌వే పైకి వచ్చాను. ఇక్కడే 24 గంటలు ఉన్నా. అధికారులు, సిబ్బంది కళ్లుగప్పి రన్‌వేపైకి వచ్చి ఈ వీడియో చేశా’ అంటూ ఆయన ప్రకటించుకోవడం వైరల్‌గా మారింది. దీనిపై సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఫిర్యాదుతో అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. విమానంలో ప్రయాణించేందుకు టికెట్‌ కొనుగోలు చేసుకుని, రన్‌వే వరకు వచ్చి వీడియో తీసుకుని, వెనక్కు వచ్చేశానని అతను పోలీసుల విచారణలో వివరించాడు. అలా వెళ్లి- ఇలా రావడం సాధ్యం కాదని గుర్తించిన పోలీసులు అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణను తీవ్రం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని