logo

టీకా తీసుకున్నా మాస్కు తప్పనిసరి: జిల్లా జడ్జి

బూస్టర్‌ డోస్‌ టీకా తీసుకున్నా విధిగా మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖరప్రసాద్‌ అన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగుల కోసం జిల్లా కోర్టులో ఏర్పాటుచేసిన

Published : 25 Jan 2022 03:47 IST

టీకా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న జిల్లా జడ్జి చంద్రశేఖర ప్రసాద్‌, పక్కన న్యాయమూర్తి

జావీద్‌పాషా, బార్‌ ప్రతినిధులు నాగేశ్వరరావు, చంద్రశేఖర్‌

ఖమ్మం న్యాయవిభాగం, న్యూస్‌టుడే: బూస్టర్‌ డోస్‌ టీకా తీసుకున్నా విధిగా మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖరప్రసాద్‌ అన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగుల కోసం జిల్లా కోర్టులో ఏర్పాటుచేసిన బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ను సోమవారం డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ఎంఏ.జావీద్‌పాషా, బార్‌ అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావుతో కలిసి న్యాయమూర్తి ప్రారంభించారు. బార్‌ సంయుక్త కార్యదర్శి ఇమ్మడి లక్ష్మీనారాయణ తొలి టీకా వేసుకున్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి టి.శ్రీకాంత్‌, బార్‌ ఉపాధ్యక్షుడు కె.గురుమూర్తి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌, ప్రతినిధులు మల్లెం రవిప్రసాద్‌, గరిక సంపత్‌, వైద్యాధికారి మణికుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని