logo

హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర

శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు అన్నారు.

Published : 26 Apr 2024 03:16 IST

కారేపల్లి, తల్లాడ, న్యూస్‌టుడే: శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు అన్నారు. కారేపల్లిలో గురువారం రోడ్‌షో నిర్వహించారు. మోదీని మరోసారి ప్రధాని చేసే దిశగా ఓటర్లు తీర్పునివ్వాలని అభ్యర్థించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంరాథోడ్‌, వైరా నియోజకవర్గ కన్వీనర్‌ నెల్లూరి కోటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధులు కల్తి రాంప్రసాద్‌, దొడ్డ అరుణ, బిక్షపతి, ధనసరి శ్రీను, తురక నారాయణ పాల్గొన్నారు. తల్లాడలో ఎంపీటీసీ సభ్యురాలు చల్లా తిరుమలాదేవి తాండ్ర వినోద్‌రావు, భాజపా జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, తల్లాడ మండల అధ్యక్షుడు ఆపతి వెంకటరామారావు ఆధ్వర్యంలో ఆపార్టీలో చేరారు. నాగులు, చల్లా నవీన్‌, రాము, వెంకట్‌, రాంకుమార్‌, కిరణ్‌, ప్రవీణ్‌     తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని