logo

చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ

చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్‌దత్‌ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్‌ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుళ్ల ....

Published : 26 Apr 2024 05:56 IST

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్‌దత్‌ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్‌ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుళ్ల   (ఎస్‌సీటీపీసీ)తో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శిక్షణ   కానిస్టేబుళ్లు లోక్‌సభ ఎన్నికల విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని, శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని నిలువరించేందుకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోందని వివరించారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్స్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, చెక్‌పోస్టులు, మొబైల్‌ పార్టీలు, పోలింగ్‌ రోజు,    ఓట్ల లెక్కింపు సందర్భంగా నిర్వహించే విధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల సభలు,       సమావేశాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అదనపు డీసీపీ గణేశ్‌, ఏఆర్‌ అదనపు డీసీపీ విజయబాబు, ఏఆర్‌ ఏసీపీ నర్సయ్య, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని