logo

ఎన్నికలను బహిష్కరిస్తాం

లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని పెద్దవెంకటాపురం గ్రామస్థులు గురువారం తీర్మానించారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం   లేదని, ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు తర్వాత తమవైపు కన్నెత్తి చూడటం లేదని వాపోయారు.

Published : 10 May 2024 04:17 IST

సమస్యలు వెల్లడిస్తున్న పెద్ద వెంకటాపురంవాసులు

లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని పెద్దవెంకటాపురం గ్రామస్థులు గురువారం తీర్మానించారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం   లేదని, ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు తర్వాత తమవైపు కన్నెత్తి చూడటం లేదని వాపోయారు. త్రీఫేజ్‌ విద్యుత్తు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని, సరైన రహదారి లేకపోవడంతో అత్యవసర వైద్యసేవల సమయంలో అవస్థలు పడుతున్నామన్నారు. పెద్ద వెంకటపురం నుంచి సింగారం వయా బుస్రాయి మీదుగా రోడ్డు సౌకర్యం కల్పించాలన్నారు. పెద్ద వెంకటాపురం గ్రామాన్ని ఎంపీఓ బత్తిన శ్రీనివాసరావు గురువారం సందర్శించారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నికలు జరగడానికి సహకరించాలని స్థానికులను కోరారు.

ఆళ్లపల్లి, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు