logo

పాలేరు మళ్లీ పోటెత్తాలి..

సమర్థ నాయకత్వాన్ని చట్టసభలకు పంపించే వజ్రాయుధం ఓటు.. 18 ఏళ్లు పైబడి జీవించి ఉన్న ప్రతీ పౌరుడికీ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది.

Updated : 10 May 2024 06:05 IST

కూసుమంచి, న్యూస్‌టుడే: సమర్థ నాయకత్వాన్ని చట్టసభలకు పంపించే వజ్రాయుధం ఓటు.. 18 ఏళ్లు పైబడి జీవించి ఉన్న ప్రతీ పౌరుడికీ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. తమ ఓటును వినియోగించుకోవడంలో ఖమ్మం పార్లమెంటు పరిధిలోని పాలేరు సెగ్మెంట్ ఎప్పుడూ తన ప్రత్యేకత చాటుకుంటోంది. రాష్ట్రంలోనే అతి ఎక్కువ శాతం పోలింగ్‌ జరిగే నియోజకవర్గాల్లో ఒకటిగా నిలుస్తోంది. వచ్చే సార్వత్రిక పోలింగ్‌లోనూ సత్తా చాటేందుకు నియోజకవర్గ వాసులు సమాయత్తమవుతున్నారు.

పెరిగిన ఓటర్లు.. గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2,36,287 ఓట్లు ఉండగా, 2,14,810 మంది ఓటు వేశారు. ప్రస్తుత ఓటర్లు 2,40,806 మంది. వీరిలో 1,15,717 పురుషులు కాగా, 1,25,081 మంది మహిళలు.. ఎనిమిదిమంది ఇతరులున్నారు. ఓటర్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పోలింగ్‌ కేంద్రాల సంఖ్య పెంచింది. 290 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది.


ఎందుకిలా?

  • నియోజకవర్గంలో 90 శాతం గ్రామీణ ప్రాంతమే. ఖమ్మం నగర శివారులో ఉండే ఖమ్మం గ్రామీణం మండలంలోని కొన్ని కాలనీలు మినహా ఓటర్లంతా గ్రామీణులే. పల్లెవాసుల్లో ఓటు చైతన్యం ఎక్కువగా ఉంటోంది.
  • ఓటు హక్కు వినియోగంలో అలసత్వానికి తావీయకుండా ప్రతి ఎన్నికల సమయంలో క్రమశిక్షణగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్తున్నారు. గంటలపాటు క్యూలో నిల్చోవాల్సి వచ్చినా ఓపికగా వేచిఉంటున్నారు.
  • రాజకీయ చైతన్యం కూడా గణనీయ ఓటింగ్‌కు మరో కారణం.
  • ప్రభుత్వ యంత్రాంగం ప్రచారం, రాజకీయ పార్టీల నాయకత్వం చూపించే చొరవ సైతం భారీ ఓటింగ్‌కు కారణమవుతోంది.

సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం ఇలా..

2014: 89.22  2019: 82.87 (జిల్లాలో మొదటి స్థానం)

శాసనసభ ఎన్నికల్లో

2018: 90.99 (రాష్ట్రంలో ద్వితీయ స్థానం)
2023: 90.91 శాతం (జిల్లాలో ప్రథమ).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు