logo

కాంగ్రెస్‌ హామీలు నమ్మి మోసపోవద్దు: పువ్వాడ

కాంగ్రెస్‌ హామీలను నమ్మి మోసపోవద్దని, తాము అందించిన సంక్షేమాన్ని గుర్తించి లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు ఓటు వేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఆ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Published : 10 May 2024 04:33 IST

ప్రసంగిస్తున్న మాజీ మంత్రి అజయ్‌, చిత్రంలో అభ్యర్థి నామా, ఎంపీ రవిచంద్ర

రఘునాథపాలెం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ హామీలను నమ్మి మోసపోవద్దని, తాము అందించిన సంక్షేమాన్ని గుర్తించి లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు ఓటు వేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఆ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రఘునాథపాలెం మండలం మంచుకొండలో కార్నర్‌ మీటింగ్‌ను గురువారం రాత్రి నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి వారు ప్రసంగించారు. కల్లబొల్లి హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. మహాలక్ష్మి అంటూ మొండి చెయ్యి చూపిందని ఎద్దేవా చేశారు. మహిళలకు రూ.2500 ఇస్తానని, గత ఆరు నెలల్లో రూ.12,500 బకాయి పడిందని తెలిపారు. తులం బంగారం హామీని పాలకులు తుస్సుమనిపించారని విమర్శించారు. ప్రభుత్వం ఇస్తున్న చెక్కులు బౌన్స్‌ అవడం   సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఒక్క మైనారిటీ మంత్రి అయినా ఉన్నారా? అని ప్రశ్నించారు. మొక్కజొన్నకు ఇస్తానన్న రూ.500 బోనస్‌ను ఎగ్గొట్టారన్నారు. రఘునాథపాలెం మండలాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కచోట నిర్మించడంతోపాటు, అక్కడి వరకు డివైడర్‌తో రోడ్డు వేశామని పేర్కొన్నారు. అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని కోరారు.  డీసీసీబీ మాజీ ఛైౖర్మన్‌ కూరాకుల నాగభూషయ్య, మద్దినేని వెంకటరమణ, అజ్మీరా ఈరూనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని