logo

వంద రోజుల పఠనం

పుస్తకం మస్తిష్క నేస్తం అన్నారు పెద్దలు. బడిలో పాఠాలతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడానికి పుస్తకాలు ఉపయోగపడతాయి. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడంతో పాటు వారిలో నైపుణ్యాలు పెంపొందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం

Published : 20 Jan 2022 03:28 IST

ప్రణాళికతో విద్యాశాఖ ముందుకు

పుస్తకాన్ని చదివిస్తున్న ప్రధానోపాధ్యాయుడు

ఆత్మకూరు, న్యూస్‌టుడే: పుస్తకం మస్తిష్క నేస్తం అన్నారు పెద్దలు. బడిలో పాఠాలతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడానికి పుస్తకాలు ఉపయోగపడతాయి. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడంతో పాటు వారిలో నైపుణ్యాలు పెంపొందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘వంద రోజుల పఠనం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 2022 జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

జిల్లాలో 4369 ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పరిధిలో 7.20 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. 3549 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో దాదాపు 1.30 లక్షల మంది ప్రీ ప్రైమరీ విద్యార్థులు ఉన్నారు. ఆయా పాఠశాలల్లో పుస్తక పఠనాన్ని ప్రారంభించారు.

ఉద్దేశమిది : అంగన్‌వాడీ కేంద్రాల నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్ద్థుల్లో చదివే సామర్థ్యాన్ని పెంచడం, విద్యార్ద్థులు పాఠ్య పుస్తకాలతో పాటు జ్ఞానార్జనకు ఇతర పుస్తకాలపై మక్కువ పెంచడం, గ్రంథాలయాలకు వెళ్లేలా ప్రోత్సాహించడం చేస్తారు.

ప్రయోజనాలివి : సాంకేతిక ప్రపంచంలో విద్యార్థుల్లో చదవటం పట్ల ఆసక్తి సన్నగిల్లుతోంది. వీరిపై టీవీలు, చరవాణుల ప్రభావం అధికంగా ఉంది. వంద రోజుల పఠనంతో ఇవన్నీ దూరమవుతాయి.

2వ తరగతి వరకు సంఖ్యాశాస్త్రం, దీనికి సంబంధించిన భావనలు, ప్రాథమిక అవగాహన, సామార్థ్యాలు అభివృద్ధి అవుతాయి. ● 3వ తరగతిలో ప్రవేశించే సమయానికి విద్యార్ద్థులు అర్థవంతంగా చదవటం, రాయడంలో మెరుగవుతారు.● మెరుగైన మార్గంలో పఠనం వల్ల అక్షరాస్యత, సంఖ్య జ్ఞానాన్ని సాధించటానికి తరగతి గదిలో పటిష్ఠ పునాది పడుతుంది.

కొత్త విషయాలు తెలుస్తాయి

- చాంద్‌బాషా, ఎనిమిదో తరగతి,ప్రభుత్వ బాలురోన్నత పాఠశాల

పుస్తకాలు చదవటం ద్వారా కొత్త విషయాలు తెలుస్తాయి. చదివేకొద్ది ఆసక్తి పెరుగుతోంది. బాగా చదివే విద్యార్థు.ల మధ్య మంచి వాతావరణంలో పోటీ ఉంటుంది. అక్షర పరిజ్ఞానం ఉంటే అన్నింటా రాణించవచ్ఛు

చరవాణులకు దూరంగా ఉండేలా అవగాహన

- రంగారెడ్డి, డీఈఓ

విద్యార్థుల్లో చదవటం అనే అంశంపై ఆసక్తి పెంచేందుకే వంద రోజుల ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. విద్యార్థులు కొందరు చదవటంలో వెనకబడ్డారు. వీరిని ప్రోత్సాహించి వెలుగులోకి తీసుకొస్తాం. చరవాణులకు దూరంగా ఉండేలా అవగాహన కల్పిస్తాం. బడిలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచుతాం. పుస్తక పఠనంపై వారం వారం బాధ్యులుగా ఉన్న ఉపాధ్యాయుడి పర్యవేక్షణ ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని