logo

వారం రోజుల్లో కనీస వసతులు

జగనన్న కాలనీల్లో వారం రోజుల్లో కనీస వసతులు కల్పించాలని కలెక్టర్‌ కోటేశ్వరరావు అన్నారు. గోనెగండ్లలోని జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలను శనివారం ఆయన పరిశీలించారు.కాలనీలో సమస్యలపై లబ్ధిదారులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు.

Published : 03 Jul 2022 02:10 IST

కలెక్టర్‌ కోటేశ్వరరావు

మండలాధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌

గోనెగండ్ల, న్యూస్‌టుడే: జగనన్న కాలనీల్లో వారం రోజుల్లో కనీస వసతులు కల్పించాలని కలెక్టర్‌ కోటేశ్వరరావు అన్నారు. గోనెగండ్లలోని జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలను శనివారం ఆయన పరిశీలించారు.కాలనీలో సమస్యలపై లబ్ధిదారులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. నీటి సమస్య, రహదారి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. కట్టించిన ఇళ్లకు సక్రమంగా క్యూరింగ్‌ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ స్పందించి వారం రోజుల్లో కాలనీలో రహదారులు, నీటి సౌకర్యం కల్పించాలని ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు. వీలైనంత త్వరగా విద్యుత్తు లైన్‌ మార్చాలని ఏఈ సుధాకర్‌రావుకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు వేణుగోపాల్‌, హౌసింగ్‌ ఏఈ లక్ష్మన్న, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని