logo

కర్నూలులో స్వాత్మానందేంద్రస్వామి

స్వధర్మ వాహని ప్రచార యాత్రలో భాగంగా విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి సోమవారం కర్నూలులో పర్యటించారు.

Published : 29 Nov 2022 02:19 IST

గోవులకు గ్రాసం అందిస్తున్న స్వాత్మానందేంద్రస్వామి

కర్నూలు నగరం, న్యూస్‌టుడే:  స్వధర్మ వాహని ప్రచార యాత్రలో భాగంగా విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి సోమవారం కర్నూలులో పర్యటించారు. పలువురు నివాసాల్లో రాజశ్యామల, చంద్రమౌళీశ్వరుల పీఠార్చన పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి నివాసంలో పూజలు చేశారు. అక్కడికి వచ్చిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి దంపతులు, మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి, ఎస్వీ దంపతులకు ఆశీస్సులు అందజేశారు. శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నివాసంలో పూజలు చేశారు. నగర శివారులోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అంతకుముందు కల్లూరులోని చౌడేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నారు. గోసంరక్షణ కేంద్రానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. సూర్యనారాయణస్వామి ఆలయంలో కలెక్టరు కోటేశ్వరరావు, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌ దంపతులు స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని