logo

ప్రభుత్వానికి పతనం తప్పదు

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి పతనం తప్పదని సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు పి.నిర్మల అన్నారు.

Published : 21 Mar 2023 02:26 IST

ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలు, సీఐటీయూ నాయకులు

కర్నూలు ఎన్టీఆర్‌ సర్కిల్‌ , న్యూస్‌టుడే: సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి పతనం తప్పదని సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు పి.నిర్మల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమబాట పడితే ప్రభుత్వం దమనకాండ ప్రయోగించిందని ధ్వజమెత్తారు. చలో విజయవాడ కార్యక్రమానికి బయలుదేరిన అంగన్‌వాడీలు, సీఐటీయూ నాయకులను ఎక్కడికక్కడ రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్ల వద్ద అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కర్నూలు గ్రామీణ, అర్బన్‌ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు కలిసి సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా రూ.వెయ్యి పెంచి ఇస్తామని చెప్పిన జగన్‌ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. యాప్‌లు ప్రవేశపెట్టి.. పనిభారం పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం.గోపాల్‌, పుష్ప, ఉమ, సువర్ణ, విజయకుమారి, టి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని