logo

బైపాస్‌ జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు

ఆదోని పట్టణ శివారులో నిర్మించాల్సిన 167వ జాతీయ బైపాస్‌ రహదారి నిర్మాణానికి కేంద్ర ఉపరితల, రహదారుల(గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌)శాఖ రూ.241.99 కోట్లు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

Published : 02 Apr 2023 02:49 IST

శివారులో జాతీయ రహదారి మార్గం

ఆదోని పాతపట్టణం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణ శివారులో నిర్మించాల్సిన 167వ జాతీయ బైపాస్‌ రహదారి నిర్మాణానికి కేంద్ర ఉపరితల, రహదారుల(గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌)శాఖ రూ.241.99 కోట్లు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇందుకు సంబంధించిన సాంకేతిక, పరిపాలనపరమైన అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి శనివారం తెలిపారు. నిర్మాణానికి రూ.99.58 కోట్లు, భూసేకరణకు రూ.140.5 కోట్లు, నిర్వహణకు రూ.1.91 కోట్లు లెక్కకట్టారన్నారు. త్వరలో పనులు పూర్తి అయి, ట్రాఫిక్‌ సమస్యలు తీరుతాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని