logo

వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి

తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రితో మాట్లాడి వైద్యుల సమస్యలు పరిష్కరిస్తామని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌ఎండీ ఫరూక్‌ హామీ ఇచ్చారు.

Published : 05 May 2024 02:44 IST

మాట్లాడుతున్న తెదేపా పార్లమెంట్‌ అభ్యర్థి బైరెడ్డి శబరి

నంద్యాల పట్టణం, పాతపట్టణం, న్యూస్‌టుడే : తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రితో మాట్లాడి వైద్యుల సమస్యలు పరిష్కరిస్తామని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌ఎండీ ఫరూక్‌ హామీ ఇచ్చారు. నంద్యాలలో ఐఎంఏ భవనానికి స్థలం కేటాయించేందుకు తమవంతు కృషి చేస్తామని చెప్పారు. నంద్యాల పట్టణంలో శనివారం వారు వైద్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా వైద్యుల విభాగం అధ్యక్షుడు డా.మధుసూదనరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. ఆసుపత్రుల వద్ద సమస్యలు తలెత్తితే అండగా ఉంటామన్నారు. అంతకుముందు వైద్యులు తమ సమస్యలను శబరి, ఫరూక్‌ల దృష్టికి తీసుకొచ్చారు. తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌, డా.సహదేవుడు, డా.ఆదినారాయణ, డా.నాగేశ్వరరావు, డా.శివచరణ్‌రెడ్డి, డా.రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని