logo

రవ్వలకొండ చరిత్రకు జలసఆది

కలుషిత జలం పురవాలసులను కలవరపెడుతోంది. తాగునీటి పైపులైన్లు ఏకంగా మురుగు కాలువల్లోనే ఉండటంతో తాగునీటిలో మురుగు కలుస్తోందని ఆందోళన చెందుతున్నారు.

Published : 07 May 2024 06:33 IST

ముప్పు ముంచేస్తోంది: డోన్‌లోని శ్రీనివాసనగర్‌ ప్రధాన రహదారి పక్కన మురుగు కాలువలో రెండు చోట్ల జీడీపీ నీటి గొట్టాలు ఏర్పాటు చేశారు. పైపు దెబ్బతింటే ప్రమాదం తప్పేలా లేదు.

కలుషిత జలం పురవాలసులను కలవరపెడుతోంది. తాగునీటి పైపులైన్లు ఏకంగా మురుగు కాలువల్లోనే ఉండటంతో తాగునీటిలో మురుగు కలుస్తోందని ఆందోళన చెందుతున్నారు. పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ అధ్వానంగా మారింది. పలు చోట్ల ఏర్పాటు చేసిన నీటి సరఫరా పైప్‌లైన్లు మురుగు కాలువల్లోనే ఉన్నాయి. దీనికి తోడు లీకేజీల కారణంగా తాగునీటిలో మురుగు కలిసి సరఫరా అవుతోంది. ఈ నీటిని తాగిన జనాలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో తాగునీటి సరఫరా వ్యవస్థ అత్యంత ప్రమాదకరంగా మారింది. ‘ఈనాడు’ పరిశీలనలో వెలుగు చూసిన ‘విష’కంటకాలు ఇవీ.

మురుగు కలుస్తున్నా..: డోన్‌లోని ఇందిరానగర్‌ ప్రాంతంలో తాగునీటిలో మురుగు కలుస్తున్నా.. అధికారులు చర్యలు చేపట్టడం లేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాఘవేంద్ర నీవే రక్ష: కర్నూలులోని రాఘవేంద్రస్వామి ఆలయం వద్ద..

రంగుమారిన నీరు: నంద్యాలలోని ఉప్పరిపేటలో తాగునీటిలో మురుగు కలిసి కలుషిత జలం సరఫరా అవుతోంది. రంగు మారి వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు.

నగరజీవికి భయం: కర్నూలులోని కొండారెడ్డి బురుజు ప్రాంతంలో..

మారని తీరు: నంద్యాలలోని బుడగ జంగాల కాలనీలో మురుగు కాలువలో పైపులు

ఇటు పైపు చూడరూ..: కర్నూలు నగరంలోని కేసీ కాలువపై ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైను అధ్వానంగా మారింది.

లీకేజీలతో కలుషితం: ఆదోనిలోని గుల్షన్‌ దర్గా నుంచి హవన్నపేటకు వెళ్లే మార్గంలో లీకేజీలతో పైపులైన్‌లో మురుగు కలుస్తోంది.

ఈనాడు, కర్నూలు,  న్యూస్‌టుడే, బృందం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని