logo

మా ఓట్లేవీ..

ఓటు హక్కు కలిగి ఉన్న ఉద్యోగులకు అటు నంద్యాలలో, ఇటు కర్నూలులోనూ ఓట్లు గల్లంతయ్యాయి. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు నంద్యాలలో శిక్షణ తీసుకున్నామని..

Published : 09 May 2024 03:17 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే :  ఓటు హక్కు కలిగి ఉన్న ఉద్యోగులకు అటు నంద్యాలలో, ఇటు కర్నూలులోనూ ఓట్లు గల్లంతయ్యాయి. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు నంద్యాలలో శిక్షణ తీసుకున్నామని.. అక్కడ ఇతర జిల్లాల ఉద్యోగులుగా అక్కడే ఓటు హక్కు కల్పించాల్సి ఉందని.. అక్కడేమో ఓట్లు లేవంటున్నారని పేర్కొన్నారు. తాము కర్నూలులో ఓటరుగా ఉన్నామని.. ఇక్కడే ఓటేద్దామంటే ఇక్కడ కూడా జాబితాలో పేర్లు లేవని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించినట్లు అధికారులు చెబుతున్నా ఆ పరిస్థితి కానరాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • ఇదివరకే పోస్టల్‌ బ్యాలట్‌కు దరఖాస్తు చేసుకొని.. మూడు రోజులుగా ఓటేయని ఉద్యోగులకు గురువారం చివరి అవకాశం కల్పించారు. 3,582 మంది ఉద్యోగులు ఓటు హక్కుకు దూరంగా ఉన్నారు. వీరంతా చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి.సృజన విజ్ఞప్తి చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని