logo

‘వైకాపా మూకలకు పోలీసుల అండ’

జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలపై వైకాపా నేతలు భౌతిక దాడులకు పాల్పడుతుండటం మంచిపద్ధతి కాదని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి హెచ్చరించారు.

Published : 09 May 2024 03:22 IST

కేంద్ర ఎన్నికల పోలీసు పరిశీలకులు ఉమేశ్‌కుమార్‌కు ఫిర్యాదు చేస్తున్న తిక్కారెడ్డి, ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలపై వైకాపా నేతలు భౌతిక దాడులకు పాల్పడుతుండటం మంచిపద్ధతి కాదని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి హెచ్చరించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆకెపోగు ప్రభాకర్‌తో కలిసి బుధవారం మాట్లాడారు. మణెకుర్తి పంచాయతీ పరిధిలోని అంగసగల్లులో వైకాపాకు చెందిన పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలపై గొడ్డళ్లతో దాడి చేయడంతో 30-35 మంది గాయపడ్డారన్నారు. స్థానికంగా ఉన్న పోలీసులు దాడులను నిలువరించకుండా వారికి అండగా నిలిచారని ఆరోపించారు. సీఎం జిల్లాకు ఏమి చేయకపోయినా.. సిగ్గులేకుండా ఓట్లడిగేందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ సాగించే చివరి పర్యటన ఇదేనన్నారు. ఇప్పటికే ఓటమి భయం పట్టుకున్న జగన్‌ ఇలా దాడులకు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. హనుమంతరావు చౌదరి పాల్గొన్నారు.

పోలీసులపై చర్యలు తీసుకోవాలి

ఆలూరు, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల్లో కొందరు పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి, కర్నూలు ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌ విన్నవించారు. వారు బుధవారం నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో కేంద్ర ఎన్నికల పోలీసు పరిశీలకులు ఉమేశ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని