logo

48 గంటల ముందుగానే ప్రచారం నిలిపివేయాలి

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సబ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ శుక్రవారం సాయంకాలం సమావేశం నిర్వహించారు.

Published : 10 May 2024 21:41 IST

ఆదోని మార్కెట్: ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సబ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ శుక్రవారం సాయంకాలం సమావేశం నిర్వహించారు. ప్రధానంగా 48 గంటలకు ముందుగానే ఎన్నికల ప్రచారానికి పుల్‌ స్టాప్ పెట్టాలన్నారు. ప్రచారానికి వచ్చిన ఇతర ప్రాంతాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు కానీ ప్రతినిధులు కానీ శనివారం సాయంత్రం 5 గంటలలోపు నియోజకవర్గ వదిలి వెళ్లాలని సూచించారు. ఓటింగ్ రోజు మే 13వ తేదీన వర్ష సూచన ఉండడంతో ప్రజలు త్వరితగతిన పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు