logo

వన్యప్రాణుల వేటగాళ్లకు రూ.66వేల జరిమానా

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం దుబ్బతండా అటవీ ప్రాంతంలో  జంతువులను పట్టుకునేందుకు వచ్చిన ఆరుగురికి మంగళవారం రూ.66 వేల జరిమానా విధించినట్లు అటవీశాఖ ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ పర్వేజ్‌అహ్మద్‌ తెలిపారు.

Published : 27 Mar 2024 02:12 IST

కల్వకుర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే : నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం దుబ్బతండా అటవీ ప్రాంతంలో  జంతువులను పట్టుకునేందుకు వచ్చిన ఆరుగురికి మంగళవారం రూ.66 వేల జరిమానా విధించినట్లు అటవీశాఖ ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ పర్వేజ్‌అహ్మద్‌ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కాషాగూడెంకు చెందిన సిఫాయిపాషా, షేక్‌హుసేన్‌, జానీ, షేక్‌మైబు, సయ్యద్‌అమీనా, బషీర్‌ సోమవారం అటవీ ప్రాంతంలో జంతువులను పట్టుకునేందుకు వచ్చారన్నారు. వారి నుంచి ఐదు వలలు, ఆరు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకొని జప్తు చేశామన్నారు. మంగళవారం ఆరుగురికి జరిమానా విధించి వసూలు చేశామన్నారు. వన్యప్రాణుల స్వేచ్ఛకు భంగం కలిగించడం, వేటాడటం చేస్తే అటవీశాఖ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. డిప్యూటీ ఎఫ్‌ఆర్‌వో రేణుక, బీట్ అధికారిణి లలిత పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని