logo

స్వరాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యం: మంత్రి

స్వరాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యంతోపాటు విద్య, ఉద్యోగావకాశాలు పెరిగాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. విశాఖపట్నంలో ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు జూనియర్‌ బాలికల జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌

Published : 21 Jan 2022 02:12 IST

మంత్రి హరీశ్‌రావుతో క్రీడాకారులు

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: స్వరాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యంతోపాటు విద్య, ఉద్యోగావకాశాలు పెరిగాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. విశాఖపట్నంలో ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు జూనియర్‌ బాలికల జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరిగాయి. రాష్ట్ర జట్టులో భాగస్వాములైన జిల్లాలోని ములుగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు కీర్తి, ప్రియాంక, జె.పూజ, స్వప్న, కె.పూజ ప్రతిభ కనబర్చారు. తెలంగాణ జట్టు బంగారు పతకం సహా కప్‌ను సాధించడంపై అభినందించారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో మంత్రిని క్రీడాకారిణులు కలవగా అభినందించి సత్కరించారు. క్రీడల్లో అగ్రస్థానంలో ఉండాలన్నారు. జిల్లా అధ్యక్షుడు నేతి కైలాసం, ప్రధాన కార్యదర్శి రేణుక, ఏఎంసీ ఛైర్మన్‌ సాయిరాం, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బిక్షపతి, వివిధ సంఘాల ప్రతినిధులు శ్యాంసుందర్‌, తోట సతీశ్‌, తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా బ్లైండ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నూతన సంవత్సర (బ్రెయిలీ, సాధారణ రకం) కాలమానిని మంత్రి ఆవిష్కరించారు. సిద్దిపేటలో లూయీస్‌ బ్రెయిలీ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయాలని సంఘ సభ్యులు వినతిపత్రం సమర్పించారు. అసోసియేషన్‌ ప్రతినిధులు అనిల్‌, రేఖ, నాగరాజు, సుధాకర్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని