logo

నిజాయతీ చాటిన కండక్టరు

బస్సులో దొరికిన పర్సుని బాధితుడికి అప్పగించి నిజాయతీని చాటుకున్నారు ఓ మహిళా కండక్టరు. వివరాలు ఇలా.. నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన నారాయణరెడ్డి శుక్రవారం రామాయంపేట నుంచి

Published : 21 May 2022 01:26 IST

నారాయణరెడ్డిన పర్సు అందిస్తున్న స్వప్న

మెదక్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: బస్సులో దొరికిన పర్సుని బాధితుడికి అప్పగించి నిజాయతీని చాటుకున్నారు ఓ మహిళా కండక్టరు. వివరాలు ఇలా.. నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన నారాయణరెడ్డి శుక్రవారం రామాయంపేట నుంచి కల్వకుంట్లకు వెళ్లేందుకు మెదక్‌ నుంచి సిద్దిపేటకు వెళ్లే బస్సులో రామాయంపేట వద్ద ఎక్కారు. ఈ క్రమంలో సీట్లో తన రూ.40 వేలు, రూ.20 వేల చెక్కు ఉన్న పర్సును వదిలేసి దిగిపోయారు. కండక్టర్‌ స్వప్న గుర్తించి పర్సును తన వద్ద భద్రపరచి, సిద్దిపేట ఆర్టీసీ అధికారులకు అందజేశారు. అనంతరం అతడికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. సదరు కండక్టరు సిద్దిపేట నుంచి మెదక్‌కు తిరుగు ప్రయాణంలో కల్వకుంట్ల వద్ద బాధితుడికి పర్సును అప్పగించారు. విషయం తెలుసుకున్న మెదక్‌ డిపో మేనేజర్‌ ప్రణీత్‌కుమార్‌ ఆమెను అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని