logo

పోలీసుల అదుపులో ముగ్గురు ఇరాన్‌ దేశస్థులు

తమ దేశ కరెన్సీని చూపి.. ప్రజలు, వ్యాపారస్తుల దృష్టిని మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఇరాన్‌ దేశానికి చెందిన ముగ్గురిని మెదక్‌ జిల్లా రామాయంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

Published : 03 Oct 2022 00:45 IST

రామాయంపేట, న్యూస్‌టుడే: తమ దేశ కరెన్సీని చూపి.. ప్రజలు, వ్యాపారస్తుల దృష్టిని మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఇరాన్‌ దేశానికి చెందిన ముగ్గురిని మెదక్‌ జిల్లా రామాయంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఇరాన్‌ దేశానికి చెందిన ముగ్గురు గత ఆగస్టులో విజిట్‌ వీసా (యాత్రికుల)పై దిల్లీకి వచ్చారు. అక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ప్రజలు, దుకాణ నిర్వాహకులతో అరబ్బీ, ఆంగ్లం, హిందీ భాషల్లో మాట్లాడుతూ మాట కలిపి తమ దేశ కరెన్సీని చూపి.. ఇండియా కరెన్సీని చూడలేదని, వాటిని చూపాలంటూ ఎదుటి వారి దృష్టి మరలుస్తుంటారు. అదును చూసి దుకాణాల్లోని నగదు ఎత్తుకెళ్తుంటారు. ఇటీవల రామాయంపేటలో రెండు చికెన్‌ దుకాణాలు, చేగుంటలో ఓ పెట్రోలు బంకులో ఇలాంటి ఘటనలు జరిగినట్లు సమాచారం. ఆదివారం ఆ ముగ్గురు విదేశీయులు ఓ కారులో రామాయంపేటలో తిరుగుతున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు సోమవారం వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని