logo

పరీక్షలపై భయాన్ని తొలగించాలి: ఆర్సీవో

పదో తరగతి వార్షిక పరీక్షల్లో వచ్చిన మార్పులను విద్యార్థులకు అవగాహన కల్పించాలని బీసీ గురుకులాల ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త (ఆర్సీవో) ప్రభాకర్‌ సూచించారు.

Published : 03 Feb 2023 01:03 IST

మాట్లాడుతున్న ప్రభాకర్‌, శివప్రసాద్‌, రాజశేఖర్‌, తదితరులు

కౌడిపల్లి, న్యూస్‌టుడే: పదో తరగతి వార్షిక పరీక్షల్లో వచ్చిన మార్పులను విద్యార్థులకు అవగాహన కల్పించాలని బీసీ గురుకులాల ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త (ఆర్సీవో) ప్రభాకర్‌ సూచించారు. గురువారం కౌడిపల్లి మండలం తునికి శివారులోని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల పాఠశాలలో ఉమ్మడి జిల్లాలోని గణితం, భౌతిక, రసాయనశాస్త్రాలు బోధించే పదో తరగతి ఉపాధ్యాయులకు రెండు రోజుల ఓరియన్‌టేషన్‌ కార్యక్రమం ముగింపు సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న ఆర్సీవో మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై భయాన్ని తొలగించాలని సూచించారు. గురుకుల విద్యార్థులందరూ మంచి గ్రేడ్‌ సాధించేలా కృషి చేయాలని కోరారు. విద్యార్థులకు అన్ని పాఠ్యాంశాలపై పట్టుసాధించేలా తీర్చిదిద్దాలని చెప్పారు. ప్రిన్సిపల్‌ శివప్రసాద్‌, ఏటీపీ రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని