logo

అరచేతిలో లక్షల పుస్తకాలు

ఉద్యోగ ప్రకటనలు వెలువడటంతో నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు. గ్రంథాలయాలు, కోచింగ్‌ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉద్యోగ సాధనే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Updated : 28 Mar 2024 02:11 IST

అంతర్జాలంలో పోటీ పరీక్షల సమాచారం

జాతీయ డిజిటల్‌ గ్రంథాలయం ముఖచిత్రం

గజ్వేల్‌ గ్రామీణ: ఉద్యోగ ప్రకటనలు వెలువడటంతో నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు. గ్రంథాలయాలు, కోచింగ్‌ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉద్యోగ సాధనే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ప్రణాళికాబద్ధంగా చదవడమే కాకుండా.. సిలబస్‌కు సంబంధించిన విషయ పరిజ్ఞానం అందుబాటులో ఉండాలి. ఆర్థిక స్తోమత లేనివారు, పుస్తకాలు అందుబాటులో లేని వారికి ప్రస్తుతం అంతర్జాలం చక్కటి వేదికగా మారింది. పరీక్షల సమాచారం, అవసరమైన పరిజ్ఞానంతో నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ(ఎన్‌డీఎల్‌) వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంది. ఇందులో 68 లక్షల పుస్తకాలు నిక్షిప్తమై ఉన్నాయి. జాతీయ విద్య శిక్షణ పరిశోధన సంస్థ(ఎన్సీఈఆర్టీ) రూపొందించిన వివిధ పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. వ్యవసాయ సమస్యలు, పరిష్కారానికి 50 వేల పుస్తకాలు ఉండగా, వీటితోపాటు దేశంలోని విశ్వవిద్యాలయాల నిపుణులకు సంబంధించి రూపొందించిన 38 వేల పరిశోధనా వ్యాసాలు ఉన్నాయి. ఇందులో విషయ పరిజ్ఞానానికి సంబంధించిన ఆరు విభాగాలు ఉన్నాయి. ఏ విభాగానికి చెందిన పుస్తకం కావాలో దానిపై క్లిక్‌ చేస్తే చాలు ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన పేజీలు ప్రత్యక్షమవుతాయి.

వినియోగించుకోవడం ఇలా...

నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ పేరిట అందుబాటులో ఉన్న వెబ్‌సైట్‌ను ఖరగ్‌పూర్‌ ఐఐటీ అభివృద్ధి చేసింది. ఇందులోని సమాచారాన్ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ముందుగా అభ్యర్థులు www.ndl.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్‌ కావాలి. యాప్‌ను కూడా డౌన్‌లోడ్‌ చేసుకొని సమాచారం పొందవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని