logo

రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకం అమలు చేస్తామని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. శనివారం దళిత బంధు పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్‌లతో నిర్వహించిన దూరదృశ్య శ్రవణ సమీక్షా

Published : 23 Jan 2022 05:41 IST

దూరదృశ్యశ్రవణ సమీక్షలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌

హెలిఫ్యాడ్‌ ఏర్పాటుపై అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకం అమలు చేస్తామని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. శనివారం దళిత బంధు పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్‌లతో నిర్వహించిన దూరదృశ్య శ్రవణ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా నుంచి కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, సాంఘిక సంక్షేమశాఖ డీడీ సల్మాభాను, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రాజ్‌కుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ వెంకటేశం పాల్గొన్నారు.

హెలీఫ్యాడ్‌ ఏర్పాట్ల పరిశీలన

నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: నల్గొండలోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో హెలిఫ్యాడ్‌ ఏర్పాటుపై కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ పరిశీలించారు. ఆదివారం అధికారులతో కలిసి కేంద్రీయ విద్యాలయం సమీపంలో పరిశీలించారు. అదనపు కలెక్టర్‌లు రాహుల్‌శర్మ, సర్వే అండ్‌ ల్యాడ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ నాగార్జున, అధికారులు పాల్గొన్నారు.

దైనందిని ఆవిష్కరణ

నల్గొండ గ్రామీణం: రైతులకు అందుబాటులో ఉంటు అన్నదాతల సంక్షేమం కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ అన్నారు. నల్గొండలో వ్యవసాయాధికారుల అగ్రి డాక్టర్‌ అసోసియేషన్‌ దైనందిని, కాలమానిని శనివారం కలెక్టర్‌ ఆవిష్కరించారు. అగ్రి డాక్టర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కోడిరెక్క నూతన్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి కళ్యాణ్‌చక్రవర్తి, కోశాధికారి సైదా, మహిళ కార్యదర్శి కీర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని