logo

‘హామీలను విస్మరిస్తున్న తెరాస’

కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదులో భాగంగా నల్గొండ పార్లమెంట్‌ పరిధిలో 2,64,000 సభ్యత్వాలు చేపట్టి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి తెలిపారు. మంగళవారం దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే  బాలునాయక్‌

Published : 26 Jan 2022 04:40 IST

ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సన్మానిస్తున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి, కాంగ్రెస్‌ శ్రేణులు

దేవరకొండ, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదులో భాగంగా నల్గొండ పార్లమెంట్‌ పరిధిలో 2,64,000 సభ్యత్వాలు చేపట్టి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి తెలిపారు. మంగళవారం దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే  బాలునాయక్‌ అధ్యక్షతన పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశం నిర్వహించారు. గీతారెడ్డి మాట్లాడుతూ భాజపా దేశ ప్రజలను మోసం చేస్తుండగా.. తెరాస పార్టీ రాష్ట్రంలో హామీల అమలు విస్మరిస్తోందని విమర్శించారు. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా కాంగ్రెస్‌ పార్టీ నిలబెట్టిందని వివరించారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తే తెరాస ప్రభుత్వం నాలుగు విడతల్లో రుణమాఫీ అంటూ రైతులను మోసం చేసిందన్నారు. హామీలు మరిచి అన్ని సామాజిక వర్గాలను అన్యాయం చేసిందన్నారు. గిరిజన ప్రాంతమైన దేవరకొండ నియోజకవర్గానికి ఎంపీ నిధుల నుంచి రూ.కోటి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 

హాలియా: కార్యకర్తల చురుకుదనం చూస్తుంటే వచ్చే కాలం కాంగ్రెస్‌దేనని గీతారెడ్డి అన్నారు. మంగళవారం హాలియాలో సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. సమావేశంలో జానారెడ్డిని భీష్మునిగా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అర్జునిగా ప్రత్సావించగా కార్యకర్తలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేతావత్‌ శంకర్‌నాయక్‌, కాకునూరి నారాయణగౌడ్‌, మిర్యాలగూడ మున్సిపాలిటీ ఫ్లోర్‌ లీడర్‌ బీఎల్‌ఆర్‌, హాలియా పుర ఫ్లోరలీడర్‌ చింతల చంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని