logo

భవితకు... పాలిటెక్నిక్‌

పాలిటెక్నిక్‌ కోర్సుల వైపు యువత ఆసక్తి కనబరుస్తోంది. తక్కువ సమయంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఈ కోర్సులు విద్యార్థులకు దోహదపడుతున్నాయి.

Published : 28 Jun 2022 04:55 IST

ఉమ్మడి జిల్లాలో 30న ప్రవేశ పరీక్ష


యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల

నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే: పాలిటెక్నిక్‌ కోర్సుల వైపు యువత ఆసక్తి కనబరుస్తోంది. తక్కువ సమయంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఈ కోర్సులు విద్యార్థులకు దోహదపడుతున్నాయి. పదోతరగతి పూర్తయిన తర్వాత పాలిసెట్‌తో మూడు, నాలుగేళ్లలో మంచి ఉద్యోగంలో స్థిరపడవచ్ఛు తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్యను అభ్యసించవచ్ఛు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్ఛు ఇంజినీరింగ్‌ విద్యలో రెండో సంవత్సరం నుంచే ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. పాలిటెక్నిక్‌ కోర్సును ఎంచుకుని భవిష్యత్తులో రాణించవచ్చని విద్యార్థులు భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈనెల 30న పాలిసెట్‌ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సుమారు 10వేల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు.

పరీక్ష నిర్వహణ ఇలా

పాలిసెట్‌ పరీక్షకు రెండున్నర గంటల సమయం కేటాయిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు తొమ్మిది, పదోతరగతి పాఠ్యాంశాల నుంచే ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తారు. ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు ఆయా కళాశాలల్లో సీట్లు కేటాయిస్తారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించరు. ప్రతి కేంద్రంలో కొవిడ్‌ నిబంధనలు అమలు చేయనున్నారు.

ఉపాధి అవకాశాలు

పాలిటెక్నిక్‌ కోర్సుల ద్వారా విద్యార్థులకు ముఖ్యంగా ఇంజినీరింగ్‌, ఇరిగేషన్‌, పబ్లిక్‌ హెల్త్‌, రహదారి భవనాలశాఖ, ఆర్టీసీ, ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కం, బీహెచ్‌ఈఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎన్‌టీపీసీ, ఇండియన్‌ ఆర్మీ, నేవీ తదితర శాఖలతో పాటు ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో పాలిటెక్నిక్‌ కళాశాలలు, సీట్లు

నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల.. 420

నాగార్జునసాగర్‌.. 120

సూర్యాపేట.. 180

తిరుమలగిరి 120

యాదగిరిగుట్ట 120


ఉజ్వల భవిష్యత్తుకు బాటలు

పి.జానకీదేవి, ప్రిన్సిపల్‌, నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల

పాలిటెక్నిక్‌ విద్యకు మంచి డిమాండ్‌ ఉంది. ప్రతి ఏటా అన్ని కళాశాలల్లో సీట్లు భర్తీ అవుతున్నాయి. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు సొంత జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తున్నాయి. ప్రైవేటు కంపెనీలు పాలిటెక్నిక్‌ కోర్సు పూర్తిచేసిన విద్యార్థుల వైపు ఆసక్తి కనబరుస్తున్నాయి. విద్యార్థులు పాలిటెక్నిక్‌ కోర్సులు చదివి ఉజ్వల భవితకు బాటలు వేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని