చదువుతూ.. స్వయం ఉపాధిలో శిక్షణ
చదువుతో పాటు మెరుగైన భవిష్యత్తు కోసం యువత స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు.
భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: చదువుతో పాటు మెరుగైన భవిష్యత్తు కోసం యువత స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. విద్యార్థుల ఆసక్తిని గుర్తించిన పలు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు డిగ్రీలో ప్రవేశం పొందిన వెంటనే వారి ఆసక్తి మేరకు స్వల్ప కాలిక స్వయం ఉపాధి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించి డిగ్రీ కోర్సు తరగతులు పూర్తయిన తదుపరి, సెలవుల్లో వారికి శిక్షణ ఇస్తూ బాసటగా నిలుస్తున్నాయి. బహుళజాతి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని కంప్యూటర్స్‌లో కోర్సులను నిర్వహిస్తున్నాయి. విద్యార్థులు డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగాలు సాధించే దిశగా వ్యక్తిత్వ వికాసం, ఇంటర్వ్యూ మెలకువలపై అవగాహన కల్పిస్తున్నాయి.
బ్యూటీషియన్‌గా...
బ్యూటీషియన్‌లో శిక్షణ ఇస్తున్న వైష్ణవి
బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న వైష్ణవి కళాశాలలో స్వల్పకాలిక బ్యూటీషియన్ కోర్సులో ప్రవేశం తీసుకుని శిక్షణ పూర్తి చేసింది. సెలవు రోజులు, తీరిక సమయాల్లో బ్యూటీపార్లర్లతో పాటు, వివాహాల సమయంలో పెళ్లి కూతుళ్లకు బ్యూటీషియన్ సేవలు అందిస్తోంది. నెలకు రూ.10 నుంచి రూ.15 వేలు సంపాదిస్తోంది. ప్రస్తుతం కళాశాలలోనే తరగతులు ముగిశాక బ్యూటీషియన్ కోర్సులో విద్యార్థులకు శిక్షణ ఇస్తూ అదనపు ఆదాయం పొందుతోంది. డిగ్రీ చదువుతుండగానే అదనపు కోర్సులను పూర్తి చేశానని వైష్ణవి చెబుతోంది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా...: అముతుల్ హసీబ్
భువనగిరి పట్టణానికి చెందిన అముతుల్ హసీబ్ బీకాం చదువుతుండగానే కంప్యూటర్ బేసిక్ కోర్సులో 90 రోజుల పాటు శిక్షణ పొందింది. డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సంస్థలో వెబ్‌డేటా అనలిస్ట్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం నెలకు రూ.20 వేల వరకు సంపాదిస్తోంది. ఇంటి నుంచి పనిచేస్తూ కుటుంబానికి ఆర్థికంగా చేదోడుగా నిలుస్తోంది. డిగ్రీతో పాటు తీరిక సమయంలో కంప్యూటర్ కోర్సులో శిక్షణ పొంది అదనపు అర్హత సాధించడంతో పాటు ఉపాధికి మార్గం సుగమనమైందని హసీబ్ చెబుతోంది.
డాటా క్యూరేటర్‌గా...: చుక్క శిల్ప
బీకాం చదువుతుండగానే కంప్యూటర్ కోర్సులో చేరానని చెబుతోంది చుక్క శిల్ప. ప్రస్తుతం ఖుషీ ఆర్గనైజేషన్‌లో డాటా క్యూరేటర్‌గా పనిచేస్తోంది. చదువుతో పాటు కోర్సు పూర్తి చేయడంతో డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం లభించిందని చెబుతోంది. డిగ్రీతో పాటు కళాశాల యాజమాన్యం ఉద్యోగ సాధన కోసం ఇచ్చే శిక్షణ ఎంతో ఉపయుక్తంగా ఉందని చెబుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Mohit Sharma: ఆ రాత్రి నిద్రపట్టలేదు.. నా ప్లాన్ అదే కానీ మిస్‌ఫైర్ అయింది: మోహిత్
-
World News
Kim Jong Un: కిమ్ బరువు 140 కిలోలు.. తీవ్ర నిద్రలేమితో అవస్థలు..!
-
Movies News
Chinmayi: పెళ్లంటూ చేసుకుంటే చిన్మయినే చేసుకోవాలని అప్పుడే అనుకున్నా: రాహుల్ రవీంద్రన్
-
India News
Fire Accident: కన్నూరులో నిలిచి ఉన్న ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో మంటలు
-
General News
Top 10 News @ 9AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 9AM
-
Crime News
Tirupati: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు.. ముగ్గురు తెలంగాణ వాసుల మృతి