logo

చల్లని ఓదార్పు..!

ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లబడిన వాతావరణంతో ఒక్కసారిగా ఉపశమనం కలిగించింది.

Published : 31 May 2023 05:12 IST

సూర్యాపేట కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లబడిన వాతావరణంతో ఒక్కసారిగా ఉపశమనం కలిగించింది. కొద్ది రోజులుగా రోహిణి కార్తెలో విపరీతమైన ఎండ, వేడి గాలులు వీచాయి. మంగళవారం ఒక్కసారిగా మేఘావృతమై వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. సోమవారం 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగత్ర నమోదు కాగా.. మంగళవారం ఒక్కసారే 12 డిగ్రీల వరకు తగ్గింది. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని జనగామ, నార్కట్‌పల్లి మండలంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 32.7 డిగ్రీలు మాత్రమే నమోదైంది. సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెం 31.3 డిగ్రీలు, జాజిరెడ్డిగూడెంలో 27.8 డిగ్రీలు, యాదాద్రి జిల్లాలో మోటకొండూరు 27.0, నల్గొండలో పెద్ద అడిశర్లపల్లి ఘన్‌పూర్‌లో అత్యల్పంగా 25.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత ఉండగా నమోదైంది. ఈ వేసవిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడు కనిపించకపోవడంతో ఎండ కొట్టలేదు. చల్లని గాలులు వీచాయి.దీంతో ఇప్పటి నుంచే వర్షాకాలం మొదలయ్యిందనే పరిస్థితి కనిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని